భారత్ సమాచార్, సినిమా: యంగ్ రెబల్ స్టార్ కి బాహుబలి తరువాత ఆ రెంజ్ లో హిట్ పడలేదు. బాహుబలి తరువాత వచ్చిన సాహో సో..సోగానే నడిచింది. కలెక్షన్లు వచ్చినా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. తరువాత వచ్చిన రాధ్యే శ్యామ్.. ఆదిపురూష్… ఫ్లాప్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన సలార్ మాత్రం ఎవరి అర్దం కాకపోయినా హిట్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్లు కూడా బానే వచ్చాయి. అయితే ప్రభాస్ నటించిన తాజా సినిమా కల్కి త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు ట్రైలర్స్ దుమ్ములేపుతున్నాయి. అయితే ఆ మధ్య బుజ్జి పేరుతో ఓ కారును గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఇవెంట్ పేరుతో ప్రేక్షకులకు పరిచయం చేసింది మూవీ టీం. అయితే తెలుగు రాష్ట్రాల్లో మరీ ఓ రేంజ్లో కాకపోయిన ఓ మాదిరి హైప్ వచ్చింది. కానీ మూవీ టీమ్ ప్రమోషన్స్ మాత్రం కాస్త తక్కువగానే చేస్తోందనేది ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఇందులో నటించిన స్టార్స్ ను చూసి ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారనుకుంటుంది కాబోలు. అందుకే హైదరాబాద్, ముంబాయి మినహా ఎక్కడ మూవీ ప్రమోషన్స్ చేయడం లేదు. ఇదందతా పక్కన పెడితే ఇప్పుడు అంతా ఈ సినిమా బడ్జెట్ గురించే మాట్లాడుకుంటున్నారు. బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అలా ‘కల్కి’ని ఏకంగా రూ.700 కోట్ల బడ్జెట్ తో తీశారనే టాక్ నడుస్తోంది. ట్రైలర్లో విజువల్స్ చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తుంది.
అయితే మొత్తం బడ్జెట్ అంతా సినిమా కోసమే ఖర్చు చేయరు కదా! ఇందులో రెమ్యునరేషన్స్ కూడా ఉంటాయి. అందులోను ఇందులో అందరూ హేమా హేమీలు నటించారు. హీరోగా చేసిన ప్రభాస్ కి రూ.150 కోట్ల వరకు ఇచ్చారట. ఇక ఇతర కీలక పాత్రలు చేసిన అమితాబ్, కమల్‌కి తలో రూ.20 కోట్లు ఇచ్చారని సమాచారం. హీరోయిన్ గా నటించిన దీపీకా పదుకునేకి ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ కలిసి మరో రూ.60 కోట్ల వరకు ఖర్చయిందట.
దీనిబట్టి చూస్తే మొత్తం బడ్జెట్లో రూ.250 కోట్ల వరకు పారితోషికాలకే అయిపోయినట్లు అనిపిస్తుంది. అంటే మిగిలిన రూ.450 కోట్ల బడ్జెట్‌తో మూవీ తీశారనమాట. దీనికి తోడు మూవీ టెకెట్ రేట్లు కూడా భారీగానే పెంచారని టాక్. సుమారు ఒక్కో టికెట్ ధర రూ.400పైనే ఉందంటా. ఏదేమైనా సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ డల్లుగా ఉంది. ‘కల్కి’ గనక హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్స్ మోత మోగిపోవడం గ్యారంటీ. ఎప్పటి నుంచో భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ కల కూడా నెరవేరుతుంది. మరి మీలో ఎంత మంది ‘కల్కి’ కోసం వెయిట్ చేస్తున్నారు.
మరిన్ని కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి