Homemain slides‘భారతీయుడు 2’ మూవీ ట్రైలర్ రిలీజ్...

‘భారతీయుడు 2’ మూవీ ట్రైలర్ రిలీజ్…

భారత్ సమాచార్, సినీ టాక్స్;

సామాజిక అంశాలకు అన్ని రకాల కమర్షియల్ హంగులు అద్ది ఇండ్రస్టీ హిట్ లు సాధించిన దర్శకుడు శంకర్. అతని సినీ కెరీర్ లో ‘భారతీయుడు’ మూవీ ఎప్పటికీ ప్రత్యేకమే. అందులో ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ డ్యూయల్ రోల్ నట విశ్వరూపం గురించి ఎంత చెప్పిన తక్కువే. 1996లో విడుదలైన ఈ మూవీకి 28 ఏళ్ల తర్వాత తాజాగా సీక్వెల్ ని రూపొందించాడు భారీ చిత్రాల దర్శకుడు శంకర్. అప్పట్లోనే ఈ మూవీ సీక్వెల్ తీయటానికి వీలుగా సినిమా క్లైమాక్స్ ని రూపొందించాడు డైరెక్టర్. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ని చూస్తుంటే సినిమా ఎక్కడ ముగించారో మళ్లీ అక్కడి నుంచే కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు.

తాజా ట్రైలర్ ని గమనిస్తే ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు గా మారిన భారతీయుడిని మళ్లీ థియేటర్లలోని తీసుకొస్తున్నాడు శంకర్. ట్రైలర్ ఆసాంతం చాలా ఆసక్తిగానే సాగింది. మర్మ కళ తెలిసిన ముసలి సేనాపతి ఇప్పటి ఇండియాలో ఉన్న లంచగొండితనాన్ని ఎలా అంతం అందిస్తాడు అనే అంశం తోనే కథనం సాగుతోంది. ‘దొంగలించే వాడు దొంగలిస్తునే ఉన్నాడు, తప్పు చేసే వాడు తప్పు చేస్తూనే ఉన్నాడు, ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేం అన్న భయం రావాలి, ఇది రెండో స్వాతంత్ర పోరాటం…గాంధీజీ మార్గంలో నేను, నేతాజీ మార్గంలో నేను, ’ అంటూ ట్రైలర్ లో సాగే డెలాగ్స్ మెప్పిస్తున్నాయి. యాంగ్రీ యన్ మాన్ గా సిద్దార్థ్ సరిపోయాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిస్తోంది. ఇందులో కథానాయికగా కాజల్ కూడా నటించింది కానీ ట్రైలర్ లో ఎక్కడ కనిపించలేదు. ప్రచారం చిత్రంలో కమల్ యాక్షన్ భారతీయుడిలా కనిపించాడు. అనిరుధ్ సంగీతం పర్వాలేదు. బీజీఎమ్ బాగుంది. భారతీయుడు మూవీకి ఎ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచింది. ప్రస్తుతం అనిరుధ్ ఆ స్థాయికి అందుకోలేక పోయాడు అనిపిస్తోంది. గత నెలలో రీరిలిజ్ అయిన ‘భారతీయుడు’ మూవీకి సినీ ప్రేమికుల నుంచి మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ విడుదల తర్వాత ‘భారతీయుడు 2’ పై కూడా మంచి బజ్ ఏర్పడుతుంది. ఆ అంచనాలను భారతీయుడు అందుకుంటాడో లేదో తెలియాలంటే జులై 12 వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.

మరికొన్ని సినీ సంగతులు…

ఓరి దేవుడా..కల్కి బడ్జెట్ అన్ని కోట్లా..!!

RELATED ARTICLES

Most Popular

Recent Comments