భారత్ సమాచార్, అమరావతి ;
జులై 1వ తేదీ న ఏపీ మెగా డిఎస్సీ షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో నిరుద్యోగ టీచర్లు గత మూడునెలలుగా ఎదురుచూస్తున్న ఎపి టెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాజాగా విడుదల చేశారు. టెట్ లో అర్హత సాధిస్తేనే డిఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డిఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజి ఉండటంతో ఈ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2.35 లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టెట్-2024లో 58.4 శాతం అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. అభ్యర్థుల పరంగా అయితే టెట్-2024లో 1,37,904 మంది ఉత్తీర్ణత సాధించినట్టు వెల్లడించారు. ఇప్పటి టెట్ పరీక్షలో క్వాలిఫై అవ్వని వారికి మరొక అవకాశం ఇవ్వనున్నట్టు చెప్పారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజ్ కల్పిస్తున్నామన్నారు. ఇటీవల బీఈడీ, డీఈడీ పూర్తి చేసినవారికి కూడా త్వరలో మరోసారి టెట్ నిర్వహణ ఉంటుందని మంత్రి లోకేష్ తెలిపారు.