Homemain slidesటీడీపీ టూ వైసీపీ రిటర్న్ టూ టీడీపీ మళ్లీ...

టీడీపీ టూ వైసీపీ రిటర్న్ టూ టీడీపీ మళ్లీ…

భారత్ సమాచార్, అమరావతి ;

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా కూడా వెలువడని తరుణంలో కొన్ని చోట్ల టీడీపీ శ్రేణులు అత్యుత్సాహంతో ఏపీ వార్డు/గ్రామ సచివాలయాలకు పసుపు రంగు ను అద్దాయి. అప్పటికే సచివాలయాలకు వైసీపీ పార్టీ రంగు తొలగించటానికే వందల కోట్లు ప్రజా ధనాన్ని తగలేసింది ఏపీ ప్రభుత్వం. దానికి తోడు అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. మరి అప్పటికే ఉన్న మాజీ సీఎం ఫోటోలను ఏం చేస్తారో, ఏం చేయాలో మాత్రం ఎవ్వరికి తెలీదు. వాటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఖర్చు పెట్టారో, ఎంత ఖర్చు పెట్టబోతున్నారో కూడా ఎవ్వరికీ తెలీదు. ఆ తర్వాత రాష్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నిటికీ కూడా పేర్లు మార్చే కార్యక్రమం మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వం. కానీ ఇందులో మాత్రం మిత్ర పక్షాల పార్టీ నాయకుల పేర్లకు కానీ, రంగులకు కానీ చోటు దక్కలేదనే చెప్పాలి.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పేర్లల్లో జగనన్న బదులుగా చంద్రన్న అని, వైఎస్సార్ అనే పేరుకు బదులుగా ఎన్టీఆర్ అని పథకాల పేర్లు మార్చే పనిలో ఉన్నారు ప్రభుత్వ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛను పుస్తకాల మీద, పట్టాదారు పాసు పుస్తకాల మీద, పొదుపు సంఘాల పుస్తకాల మీద, ఆరోగ్య భీమా మీద, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే పత్రాల మీద ప్రభుత్వం మారిన ప్రతి సారి కొత్తవి జారీ చేయాలంటున్నారు రాజకీయ నాయకులు. ఈ పథకాల పేర్లు, రూపురేఖలు మార్చటానికి ఎన్ని నిధలు ఖర్చు పెడుతున్నారో తెలిపే నాథుడే లేడు. టీడీపీ నుంచి వైసీపీ కి, వైసీపీ టీడీపీ కి ప్రభుత్వం మారిన ప్రతి సారి ఫోటోలు, పథకాల పేర్లు, మారుతున్నాయి ప్రజా ధనం వృథా అవుతూనే ఉంది. దీనికి ఎక్కడ పుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి. మన రాజకీయ నాయకుల, ఓటర్ల ఆలోచనల తీరు మారే వరకు దీనికి అస్సలు పుల్ స్టాప్ ఉంటుందా అనే ప్రశ్నే మిగులుతుంది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

రాష్ట్ర కార్యక్రమంగా రామోజీరావు సంస్మరణ సభ

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments