భారత్ సమాచార్, జాతీయం ;
అరెస్ట్ చేసిన తర్వాత పొలీస్ వారికి ప్రజలను కొట్టే అధికారం కూడా లేదు. ఒక వేళ మిమ్మల్ని పోలీసు అధికారులు అరెస్టు చేసిన సమయంలో కొడితే పోలీస్ ఆక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం ఆ పొలిస్ అధికారికి 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా లేదా జరిమానాతో కూడిన శిక్ష కూడా వేయవచ్చు.భారత రాజ్యాంగం పోలీసులకి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప పౌరులను కొట్టే, తిట్టే వంటి అధికారాలు ఏవీ కూడా ఇవ్వలేదు.
ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన క్షణం నుండి కోర్ట్ లో ప్రవేశ పెట్టె దాకా వారి పూర్తి బాధ్యత, రక్షణ కూడా పోలీసుల మీదే ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మీకు ఏమి జరిగిన పూర్తి బాధ్యత పోలీస్ వారిదే. అందుకే అరెస్ట్ చేసే సమయం లోనే మెమో ఆప్ అరెస్ట్ ( పేపర్ ) కచ్చితంగా రాయించాలి. Cr. P. C SECTION 41 B, C, D ప్రకారం పేపర్ మీద రాయమని పోలీసు అధికారులను కచ్చితంగా అడగాలి. ఎలా అంటే నేను పలానా పోలీస్ అధికారిని పలానా వ్యక్తిని పలానా నేరం కింద అరెస్ట్ చేస్తున్నాను అని అధికారి పేరు అతని ర్యాంక్ కానిస్టేబుల్, ఏస్ఐ etc.. తేదీ స్థలం ఏ స్టేషన్ కింద అరెస్ట్ జరుగుతుంది, ఆ సమయంలో అరెస్ట్ చేయబడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి అతనికి ఎమైన స్వల్ప లేదా తీవ్ర గాయాలు ఉన్నాయా, అతని దగ్గర వుండే వస్తువులు మొత్తం పేపర్ లో రాసి అతని బంధువులు లేదా శ్రేయోభిలాషులు లేదా సమాజంలో మంచి పేరు ఉన్న వ్యక్తి సంతకం, అరెస్ట్ చేసే పోలీస్ అధికారి సంతకం,అరెస్ట్ చేసిన వ్యక్తి యొక్క సంతకం కూడా కచ్చితంగా పేపర్ లో రాయాలి దీన్నే మేమో అప్ అరెస్ట్ అంటారు. అరెస్ట్ చేసిన 24 గంటల లోపే మెజిస్ట్రేట్ లేదా కోర్ట్ లో కచ్చితంగా ప్రవేశ పెట్టాలి.
ఏ పోలీసు అయినా మిమ్మల్ని స్టేషన్ కి రండి అని ఫోన్ చేస్తే ముందు ఆ అధికారికి ఇలా అడగాలి. Crpc సెక్షన్ 169,170,50 ల ప్రకారం నోటీసులు సర్వ్ చేయవలనని, వినయంగా కోరుచున్నాను అని చెప్పండి లేదా వారు ఫోన్ చేసిన మొబైల్ నంబర్ కు మెమొ ఆఫ్ అరెస్ట్ ఇవ్వండని మెసేజ్ చెయ్యండి.