Homemain slidesఅవ్వాతాతలకు రూ.7 వేలు.. దివ్యాంగులకు రూ.12 వేలు

అవ్వాతాతలకు రూ.7 వేలు.. దివ్యాంగులకు రూ.12 వేలు

భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచి అందిస్తున్న 28 రకాల ఫెన్షన్ లను లబ్దిదారుల ఇంటి వద్దనే పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తాజాగా తెలిపారు.పెంచిన ఫించన్ల మేరకు రూ.4,399.89 కోట్లను 65,18,496 మంది ఫించనుదారులకు కేవలం ఒక్క రోజులోనే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుండి ఫించన్లు పూర్తి అయ్యే వరకూ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు కేటాయిస్తున్నామని, అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులకు కొన్ని ఫించన్ల పంపిణీ చేస్తామని తెలిపారు.ఈ నెల 29 వ తేదీ శనివారం నాడే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పంపిణీకి సిద్దం కావాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. అత్యవసరం అయితే తప్ప తర్వాత రోజు ఫించన్ పంపిణీ ఉంటుందని లేదంటే 1వ తేదీనే 100 శాతం పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్ ఐ వీ వ్యాధిగ్రస్తులకు, కొంత మంది విభిన్న ప్రతిభావంతులకు మాత్రం డిబిటీ పద్దతి ద్వారా నేరుగా వారి బ్యాంక ఖాతాలోనే నగదును జమ చేయనున్నారు. పండుగ వాతావరణంలో ఫించన్ల పంపిణీ చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

జూలై 1న దివ్యాంగులకు రూ.12వేల పెన్షన్ అందనుంది. గతంలో రూ.4వేలు ఉండగా, తాజాగా ఎన్డీయే సర్కారు దాన్ని రూ.6 వేలకు పెంచింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల బకాయిలు రూ.6వేలతో కలిపి మొత్తంగా రూ.12వేలు చేతికి రానున్నాయి. అటు వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలకు రూ.7 వేలు చేతికి అందనున్నాయి. ఆగస్టు నుంచి వీరికి నెలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు చొప్పున పంపిణీ జరుగనుంది.

ఆ వాలంటీర్లపై చర్యలు చేపడతాం… మంత్రి

రాజీనామా చేసినా ఇంకా ఫోన్లు, సిమ్ కార్డులు తిరిగివ్వని వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి వీరాంజనేయ స్వామి తాజాగా హెచ్చరించారు. ఇప్పటివరకు 1.09 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు. ‘చాలా గ్రామాల్లో గ్రామ, వార్డు సచివాలయ భవనాలు దూరంగా ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో లేనివాటిని గుర్తించి సమగ్ర నివేదిక అందించాలని మంత్రి కోరారు. సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫొటోలు తొలగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే వాలంటీర్ల వ్యవస్థ ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర హై కోర్టు లో పిటిషన్ దాఖలైంది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

టీడీపీ టూ వైసీపీ రిటర్న్ టూ టీడీపీ మళ్లీ…

RELATED ARTICLES

Most Popular

Recent Comments