భారత్ సమాచార్, తిరుమల ;
కలియుగ ప్రత్యక్ష దైవం వడ్డీ కాసుల వాడి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో ఎదురు చూస్తున్నారు. 27-06-2024వ తేదీ గురువారం రోజున స్వామివారిని 60,782 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి భక్తితో ఒక్క రోజే తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 30,100.
సందర్శకులు శ్రీవారి హుండీలో సమర్పించిన కానుకలు రూ.3.53 కోట్లు. కడపటి సమయానికి ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు శ్రీనివాసుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరి దర్శనానికి 5 గంటల సమయం పట్టనుంది. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. శని, ఆది వారాలు కారణంగా భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.