భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్) తీవ్ర అనారోగ్యం కారణంగా నేటి తెల్లవారుజూమున 3 గంటలకు గెండెపోటుతో తుది శ్వాస విడిచారు. డి.శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27వ తేదీన నిజామాబాద్ లో జన్మించారు. 1989,1999,2004 లలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009 లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఆయన తన బాధ్యతలు నిర్వర్తించారు.కేసీఆర్ పిలుపుతో 2014 తర్వాత కాంగ్రెస కు రాజీనామా చేసి బీర్ఎస్ లో చేరారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తన సేవలను అందించారు. పదవీకాలం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ను వీడి సొంత పార్టీ కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం డీఎస్ పార్థీవ దేహం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల సందర్శన కోసం ఉంచారు. ఆయన సొంత ఊరు నిజాబామాద్ లో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్, రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్ రెండో సారి నిజామాబాద్ ఎంపీ గా గెలిచారు. పెద్దకుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు.