Homemain slidesకల్కిలో 7 నిమిషాల పాత్రకు కమల్ అన్ని కోట్లు తీసుకున్నాడా..!!

కల్కిలో 7 నిమిషాల పాత్రకు కమల్ అన్ని కోట్లు తీసుకున్నాడా..!!

భారత్ సమాచార్, సినీ టాక్స్: ‘కల్కి 2898 AD’ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ ఉన్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, విజయ్ దేవరకొండ స్క్రీన్ పై అదరగొట్టేశారు. దీంతో కల్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆ అంచనాలను అందుకుని భారీగా కలెక్షన్లు రాబడుతోంది. కల్కి సినిమా చూసిన చాలా మంది ప్రముఖులు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ అద్భుతమైన నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే కల్కి కోసం నటీనటులు భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ కల్కిలో కనిపించింది చాలా తక్కువే కానీ భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం.

కల్కిలో కమల్ హాసన్ పాత్ర కేవలం మూడు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. సినిమా ముగిసే సన్నివేశంలో కమల్ హాసన్ కొంత గంభీరంగా కనిపిస్తారు. రెండో భాగం కూడా ఉండటంతో చివరిలో ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అయితే మొదటి భాగంలో అతని పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. సినిమా మొత్తంలో కేవలం మూడు సార్లు మాత్రమే కమల్ కనిపిస్తాడు. దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో పాత్రలోని బలాన్ని చూపించాడు అంతే చూస్తున్న వారికి కూడా ఆయన పాత్ర గురించి పెద్దగా అర్ధం కాలేదు కూడా. రెండో భాగంలో విలన్ పాత్ర ఆధారంగా కథ మొత్తం సాగుతుందని చివర్లో ఇచ్చిన ట్విస్ట్ ఆధారంగా తెలుస్తుంది. అయితే పార్టు 2లో అయినా ఆయన పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందో లేదో చూడాలి.

మొదటి పార్ట్ లో ఆయన పాత్ర చిన్నగా, నెగిటివ్ రోల్ గా ఉన్నప్పటికీ కమల్ ఒప్పుకోవడం గొప్ప విషయం.. ‘కల్కి 2898 ఏడీ’ లో నటించేందుకు కమల్ హాసన్ రూ. 20 కోట్ల పారితోషికం ఇచ్చారనే వార్త ప్రచారంలో ఉంది. ‘కల్కి’ లో కమల్ హాసన్ కనిపించేది కేవలం 7నిమిషాల 4సెకన్లు మాత్రమే. ఇంత తక్కువ సమయంలోనే కమల్ హాసన్ కి 20 కోట్లు ఇచ్చారు నిర్మాత అశ్వినీదత్. ‘కల్కి 2898 AD’లో కమల్ హాసన్ కనిపించిన నిడివి తక్కువే అయినా, ఆయన పాత్ర షూటింగ్ చాలా రోజులు పట్టిందని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. అయితే ఈ మొత్తం రెండు పార్టలకు కలిపి ఇచ్చారా లేదా మొదటి పార్టుకే ఇచ్చారో నిర్మాత చెప్పకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments