భారత్ సమాచార్, అమరావతి ;
భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విద్యుత్ బిల్లుల చెల్లింపులపై తాజాగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇకమీదట Phonepe, GPay, PayTM మరియు ఇతర UPI Apps నందు విద్యుత్ బిల్లులు చెల్లించటానికి వీలు పడదు. ఇక మీదట ఆంధ్రప్రదేశ్ విద్యుత్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి APSPDCL Consumer App ని డౌన్లోడ్ చేసుకుని విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. లేదా, APSPDCL డిస్కం అధికారిక వెబ్సైట్ https://www.apspdcl.in నుంచి కూడా కరెంటు బకాయిలు చెల్లించవచ్చని అధికారులు వినియోగదారులకు తెలియజేశారు. APSPDCL యాప్ లేదా వెబ్సైట్ నుంచి బిల్లులు చెల్లించేటప్పుడు మాత్రం వినియోగదారులకు PhonePe, GPay, PayTM లేదా ఇతర UPI apps వాడే అవకాశం కల్పించారు. అలాగే డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్యాష్ కార్డ్స్ ద్వారా కూడా బిల్లు చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.