భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
వెండితెరపై చాలా ప్రేమ కథలు జీవం పోసుకున్నాయి. కానీ కొన్ని మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ అలాగే నిలిచిపోతాయి. అలాంటి ప్రేమ కథా చిత్రాల్లో నిలిచే మొదటి చిత్రం ‘మరో చరిత్ర’. ఇందులోని పాటలు కూడా ఆల్ టైం క్లాసిక్ గా నిలిచాయి. ఈ సినిమా ప్రభావం వెండితెర ప్రేమికులపై ఎంతగా నిలిచిందంటే… ఈ సినిమాలోని ప్రేమికుల పేర్లు బాలు-స్వప్న. ఈ పేర్లనే తర్వాత కాలంలో చాలా సినిమాల్లోని హీరోహీరోయిన్లకు పెట్టారు. వాటిల్లో కొన్ని సినిమా పేర్లు… యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’లో నాయకనాయికల పేర్లు బాలు-స్వప్నా నే. పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ లవ్ మ్యూజికల్ మూవీ ‘తొలిప్రేమ’లో కూడా బాలు-స్వప్నా లు ఉంటారు. చాలా మంది ప్రేమికులకి గుర్తుండిపోయే చిత్రం ‘కొత్త బంగారు లోకం’లో బాలు-స్వప్న లు ప్రేమను జయిస్తారు. ‘మరో చరిత్ర’ మూవీని వరుణ్ సందేశ్ రీమేక్ కూడా చేసారు. ఈ లిస్ట్ లో ఇంకా చాలా సినిమా పేర్లు ఉన్నాయి. అయితే కమల్ హాసన్ ‘మరో చరిత్ర’ విషాదం గా మిగిలితే … అదే కోవాలోని మిగిలిన ప్రేమకథలు మాత్రం సుఖాంతం అవుతాయి. కమల్ హాసన్ ‘మరో చరిత్ర’ సినిమాలోని ‘‘ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో’’ గీతం సంగీత ప్రియులకి, ఆ సినిమా ప్రేమికులకి ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. ప్రత్యేకంగా ఆ ప్రేమ గీతం లిరిక్స్ మీ కోసం…
మరో చరిత్ర-(1978)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: సుశీల, కమల్ హాసన్
పల్లవి:
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో
అప్పడియన్న ?
హ హ హ అర్ధం కాలేదా ?
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో?
తెలిసీ తెలియని అభిమానమౌనో…
చరణం 1:
మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే అది నేర్చినది
ఆహా ! అప్పడియా !
హ ! పెద్ద అర్ధం అయినట్టు !
భాష లేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినదీ
మన ఇద్దరినీ జత కూర్చినది
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో?
తెలిసీ తెలియని అభిమానమౌనో…
చరణం 2:
వయసే వయసును పలకరించినది
వలదన్నా అది నిలువకున్నది
ఏయ్.. నీ రొంబ అళగా ఇరికే..
హా..రొంబా? అంటే ?
ఎల్లలు ఏవీ వొల్లనన్నది
నీదీనాదోక లోకమన్నదీ
నీదీనాదోక లోకమన్నది
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో?
తెలిసీ తెలియని అభిమానమౌనో…
చరణం 3:
తొలిచూపే నను నిలవేసినది
మారుమాపై అది కలవరించినది
నల్ల పొన్ను.. అంటే నల్ల పిల్లా
మొదటి కలయికే ముడివేసినదీ
తుదిదాకా ఇది నిలకడైనదీ
తుదిదాకా ఇది నిలకడైనది
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో?
తెలిసీ తెలియని అభిమానమౌనో…
మరికొన్ని ప్రత్యేక సినీ సంగతులు…