Homemain slidesగుడికి, మఠానికి మధ్య ఉన్న తేడా ఏంటి?

గుడికి, మఠానికి మధ్య ఉన్న తేడా ఏంటి?

భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

గుడి అనేది ఒక ప్రజా సంస్థ లాంటిది… గుడికి ప్రార్థన చేసుకోడానికి హిందు మతం మీద విశ్వాసమున్న సమాజంలోని వ్యక్తులు ఎవరయినా రావచ్చు. వద్దనడానికి ఎవ్వరికి కూడా అధికారం ఉండదు. గుడులకు ధర్మకర్తలను ప్రభుత్వం నియమిస్తుంది. ప్రయివేటు ట్రస్టులు నిర్వహణ చేసే గుడులలో ఆ ట్రస్ట్ బోర్డ్ వారికీ నిర్వహణ బాధ్యతలు ఉంటాయి. ధర్మకర్తలు ఉండరు. అలా కాకుండా వంశ పారంపర్యముగా ధర్మకర్తలయ్యే గుడులు వున్నాయి గతంలో. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఆయిన తర్వాత వచ్చిన చట్టంలో వంశపారంపర్య ధర్మకర్తలనే దానిని చట్టంలో కొట్టేసారు. సెక్షన్ 16లో ఇప్పుడు మా నాన ఆ గుడికి ధర్మకర్త, ఆయన తరువాత నేనే అవుతాను అంటే చెల్లదు. గత నెలలో ఒకే చట్టం అమలులో ఉన్న తెలంగాణ లో హైకోర్టు ఒక కేసులో ఈ సెక్షన్ గుర్తు చేస్తూ, వంశ పారంపర్య అనేది లేదని కేసు కొట్టివేసింది. క్లుప్తంగా గుడి అనేది ఒక పబ్లిక్ సంస్థ లాంటిది.

మరి మఠం అంటే…

మఠం అనేది ఒక గురువు లేదా ఒక యోగి హిందూ మతములో ఒక సెక్షన్ ప్రజల లేదా ఒక చిన్న గ్రూప్ ఆచార వ్యవహారాలను, ఆ యోగి ప్రవచించిన బోధనలు ప్రచారం చేయుటకు ఏర్పాటు చేసిన ప్రయివేటు సంస్థ. ఆయా బోధనల మీద వారి ఆచార వ్యవహారాల మీద విశ్వాసం లేని వారని ఆ మఠం పెద్దలు లోపలికి రాకుండా నిరోధించే హక్కును కలిగి ఉంటారు. మఠాలలో వంశ పారపర్యంగా మఠాధిపతి అవడం అనేది ఉండదు.మఠం యొక్క వ్యవస్థాపకులు ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారం మాత్రమే మఠాధిపతి తదుపరి మఠాధిపతిని ఎంపిక చేసుకొని వారే శిక్షణ ఇస్తూ ఉంటారు, కావాల్సిన రీతిలో తయారు చేసుకొంటారు. ఉడిపి శ్రీకృష్ణ మఠం మఠాధిపతిగా కేవలం మధ్వా బ్రాహ్మణ వ్యక్తి మాత్రమే అవుతారు. వేరే ఎవరికి అవకాశం రాదు. మద్వా బ్రహ్మడు అవ్వాలనేది ఆ మఠం స్థాపకులు మద్వా చార్య ఏర్పాటు చేసిన నిబంధన. తిరుపతి హథీరాం మఠంకు కేవలం హిమాచల ప్రదేశ్ లో ఉండే ఒక బ్రాహ్మణ వర్గములో వారు మాత్రమే మఠాధిపతి అవుతారు. అది అక్కడ నిబంధన.

అలానే వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో స్వామి వారి కూతురు సంతతి వారవుతారనేది స్వామి వారు ఏర్పాటు చేసిన నిబంధన. అలా మన మఠంలో కేవలం వీర నారాయణ మ్మ సంతతిలో వారు మాత్రమే అవుతారు. ఆ సంతతిలో ఒకరిని ప్రస్తుత మఠాధిపతి నియామకం చేసుకోవచ్చు వారి వారసునిగా. అలా కాకుండా హిందూ ధర్మంలో పెద్ద కొడుకు తల కొరివి పెడతాడు తండ్రికి అందుకని పెద్ద కొడుకే మఠాధిపతి, వారసత్వం అంటే పెద్ద కొడుకు అందుకని పెద్ద కొడుకే మఠాధిపతి అంటే అది కుదరదు. మఠం స్థాపకుల ఏ నిబంధన ఏర్పాటు చేసారు అనేది మాత్రమే ముఖ్యం. హిందువులలో ఏ ఆచారం కూడా అన్ని ప్రాంతాలలో అన్ని వర్గాలలో ఏక రీతిగా లేదు. కులానికి ఒకటి, ప్రాంతానికి ఒకటి, వర్గానికి ఒకటి, అలాంటి ఆచారాలకు మఠాధిపతి ఎంపిక ప్రక్రియలో స్టానము లేదు.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

కపిలుడికి… హనుమంతుడి అనుగ్రహం

RELATED ARTICLES

Most Popular

Recent Comments