Homemain slidesజీవితం అందరి సరదా తీర్చేస్తుంది...

జీవితం అందరి సరదా తీర్చేస్తుంది…

భారత్ సమాచార్, ఫిలాసఫీ;

జీవితం గురించి చాలా మంది ప్రఖ్యాత కవులు, ప్రముఖ రచయితలు, పురాతన తత్వవేత్తలు చాలా రకాలుగా, చాలా విధాలుగా చెప్పారు… వాటిల్లోనుంచి జీవితాన్ని ప్రతిబింబించే ఒక మంచి భావం ఇక్కడ మీ కోసం…

జీవితం అందరికి అన్నింటిని కచ్చితంగా పరిచయం చేస్తుంది. ..

’’ పుష్టిగా తిని ఖాళీ గా కూర్చునే రోజులను, తినడానికి టైం కూడా దొరకని రోజులను,

నిద్రపట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను,

ఘోరమైన ఓటమిని, కష్టాలను-కన్నీళ్లను, ఘనమైన గెలుపుని,

ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని,

బాధలో తోడుగా ఉండే బంధాన్ని, సమస్యలను-సవాళ్లను, బాధించే బంధువులను,

వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని,

ఎవరి కంటికి కనిపించని దీనావస్థని…..”

జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది, అది నీకు నచ్చినా… నచ్చకపోయినా, వీటి అన్నింటినీ జీవితంలో ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కోవలసిందే… మొత్తంగా జీవితం అందరి సరదా తీర్చేస్తుందని అని ప్రముఖ తత్వవేత్తల మాట.

మరికొన్ని ప్రత్యేక సంగతులు…

చార్లీ చాప్లిన్ జీవిత సత్యాలు ఇవే

RELATED ARTICLES

Most Popular

Recent Comments