భారత్ సమాచార్, సీనీ టాక్స్ ;
ఈ మధ్య విభిన్న కథా చిత్రాలతో తరచుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కథానాయకుడు సుహాస్. ఈ సినిమాలతో బాక్సాఫీస్ బరిలో నిలిచి చిన్న బడ్జెట్ మూవీలతో పెద్ద హిట్ లను సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా ‘జనక అయితే కనక’ అనే సినిమా టీజర్ ను నెట్టింట రిలీజ్ చేశాడు. చిత్ర టైటిల్ తో పాటుగా ప్రచార చిత్రం కూడా కామెడీ గానే సాగింది. సుహాస్ కామెడీ టైమింగ్ నేచురల్ గానే బాగా కుదిరింది. టైటిల్ ని ఎలివేట్ చేస్తూ.. ‘‘నేను ఒక వేళ తండ్రిని అయితే.. నా పిల్లలను సిటీ లో ఉన్న బెస్ట్ హాస్పిటట్ లో చూపించాలి, నా పిల్లల్ని బెస్ట్ స్కూల్ లో చదివించాలి,బెస్ట్ కాలేజీలో చదివించాలి.. వాళ్లకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి, బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదయ్య ’’ అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది.
ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు. సందీప్ బండ్ల దర్శకుడు. విజయ్ సంగీత దర్శకుడు. ఈ మూవీని దగ్గర్లోని పండుగ సీజన్ లో థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాత భావిస్తున్నారు.