భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి ;
యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని మగ్దుంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2005-06 వ బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు ఆదివారం గెట్ టు గెదర్ ఈవెంట్ ను ఆత్మీయంగా నిర్వహించుకున్నారు. దాదాపుగా రెండు దశాబ్దాల విరామం తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ పాఠశాల మిత్రులంతా కలిసి తాము చదివిన పాఠశాలను నేడు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను, మధుర స్మృతులను ఎంతో ఉద్వేగంతో గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో తరగతి గదులలో చేసిన అల్లరి పనులను, అందుకు ఉపాధ్యాయులు ఇచ్చిన పనీష్ మెంట్ ను గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పుడు తమతో పాటు చదువుకున్న మిత్రులు, ఇటీవల మృతిచెందిన యంజాల సురేష్, పెరుమాండ్ల మల్లేష్, భాల్గురి భార్గవి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఐదునిముషాల పాటు మౌనం పాటించారు. తమకు ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన గురువులను ప్రత్యేకంగా పిలిచి వారిని ఘనంగా సన్మానించారు.
మరి కొన్ని తాజా వార్తా విశేషాలు…