భారత్ సమాచార్, జాతీయం ;
మీరు ప్రతి నెలా కరెంటు బిల్లు కట్టి విసిగిపోయారా ? లేక/ మీ కరెంటు బిల్లును వీలైనంత తగ్గించుకోవాలనుకుంటున్నారా ? అయితే మీరు కచ్చితంగా దీనికి ప్రత్యామ్నాయంగా సోలార్ కరెంట్ ను వినియోగించాల్సిందే. ప్రస్తుతం మీ ఇంటికి సోలార్ పవర్ ను అందించటానికి కావాల్సిన డబ్బు లేకపోయిన సరే స్టేస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోలార్ కరెంటును ఏర్పాటు చేసుకోటానికి కావాల్సిన రుణాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం SBI బ్యాంక్ గృహాలు, పరిశ్రమలలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్లను ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన రుణాలను అందిస్తోంది.
అర్హత, రుణాన్ని పొందే విధానం
ప్రధానమంత్రి సూర్యఖర్ పథకం కింద సోలార్ విద్యుత్ ఉత్ప త్తికి రుణ సహాయం అందించనున్నట్లు ఎస్బీఐ బ్యాంకు తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం 3 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానల్ ఏర్పాటుకు రూ.2 లక్షల వరకు, 3 కిలోవాట్ల నుంచి 10 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానల్ ఏర్పాటుకు రూ.6 లక్షల వరకు బ్యాంకు రుణం అందించనుంది. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ లో అర్హత గత వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఈ లోన్ కోసం https://www.pmsuryaghar.gov.in/లో నమోదు చేసుకోవాలి. అక్కడ అప్లికేషన్ పూర్తయిన తర్వాత https://www.jansamarth.inలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ రుణంపై వడ్డీ రేటు ఎంత?
3 KW రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ (రూ. 2 లక్షలు) ఇన్స్టాలేషన్ కోసం సంవత్సరానికి 7% వడ్డీ వేస్తారు. 3 KW పైన మరియు 10 KW వరకు సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ (రూ. 6 లక్షలు) కోసం తీసుకున్న రుణం పై 10.15% వడ్డీని లెక్కిస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హత
దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరుడై ఉండాలి.
సోలార్ ప్యానెళ్లను అమర్చుకోవడానికి అనువైన పైకప్పు ఉన్న సొంత ఇంటిని కలిగి ఉండాలి. ఇంటికి సరైన విద్యుత్ కనెక్షన్ ఉండాలి. సౌర ఫలకాల కోసం గృహస్థులు ఏ ఇతర సబ్సిడీని పొందకూడదు.రుణ మొత్తాన్ని పొందేందుకు పాన్ నంబర్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
బ్యాంకు అధికారిక వెబ్సైట్ bank.sbi ని సందర్శించడం ద్వారా, రుణాల క్రింద, SBI సూర్య ఖర్ స్కీమ్‌కి వెళ్లి దరఖాస్తును పూర్తి చేయాలి. లేకుంటే ముందుగా https://pmsuryaghar.gov.inలో దరఖాస్తు చేసి రిజిస్టర్ చేసుకుని ఆపై https://www.jansamarth.inలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు.