HomeUncategorizedత్వరలో 35 వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీ...

త్వరలో 35 వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీ…

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;

భారతదేశ వ్యాప్తంగా 35 వేల పోస్టల్ ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ నోటిఫికేషన్ విడుదల అవ్వాల్సి ఉండగా ఎలక్షన్ కోడ్ కారణంగా అధికారులు దీనిని వాయిదా వేశారు. ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగానే ఉద్యోగుల ఎంపికను చేపడతారు.

దేశవ్యాప్తంగా ఉన్న పలు పోస్టల్ సర్కిళ్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది తపాలశాఖ. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు అర్హులైన నిరుద్యోగుల నుంచి పోస్టల్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదల
కానున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు చేయటానికి ఆసక్తి గల అభ్యర్థులు కచ్చితం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీపీఎం, ఏబీఏం వంటి పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ. 10వేల నుంచి రూ.12వేల వరకు ఉంటుంది. దీనికి సంబం ధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.gov.in/ సందర్శించి తెలుసుకోవచ్చు. గతేడాది 50 వేలకు పైగా జీడీఎం పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

17,727 ఖాళీలతో ఎస్.ఎస్.సీ నోటిఫికేషన్

RELATED ARTICLES

Most Popular

Recent Comments