Homemain slidesవ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నాం

వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నాం

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ, తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం.. రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా, యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు.

🔹రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలు మాటలు చెప్పే అలవాటు గాంధీ కుటుంబానికి లేదని, కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది శిలాశాసనం లాంటిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలోనైనా, ఆరు గ్యారంటీల అమలు విషయంలోనైనా, నేటి రైతు రుణమాఫీ విషయంలోనైనా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని ముఖ్యమంత్రి తెలిపారు.

🔹రైతు రుణమాఫీ తొలివిడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 577 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలాదిమంది రైతులను ఉద్దేశించి మాట్లాడారు.

‘‘ఈ రోజు నా జీవితంలో…
మరచిపోలేని మధుర జ్ఞాపకం…
రాష్ట్ర రైతాంగ చరిత్రలో…
ఇదొక అద్భత ఘట్టం.

సేద్యం కోసం స్వేదం చిందించే రైతు…
అప్పుల ఊబిలో చిక్కి…
అగమ్యగోచరం కాకూడదు…
అన్నం పెట్టే చెయ్యి…
యాచించే పరిస్థితి ఉండకూడదు…

అందుకే…
ప్రజా ప్రభుత్వం ఏకకాలంలో…
రూ.2 లక్షల రుణమాఫీతో…
అన్నదాతకు ఆపన్న హస్తాన్ని అందించింది.

ఈ రోజు రూ.లక్ష వరకు ఉన్న…
రుణాలు మొత్తాన్ని మాఫీ చేశాం.
ఆగస్టు లో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి…
కాంగ్రెస్ హామీ ఇస్తే…
అది శిలాశాసనం అని రుజువు చేస్తాం.’’ అంటూ సీఎం రేవంత్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె కేశవరావు ,సీఎస్ శాంతి కుమారి,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

చిన్నారిని అతి దారుణంగా చంపేసిన వీధి కుక్కలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments