భారత్ సమాచార్, గుంటూరు ;
గుంటూరులోని ప్రముఖ ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ…2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ డిగ్రీ పట్టా పొందవచ్చు. అభ్యర్థులు కచ్చితంగా బైపీసీ/ఎంపీసీ/ఎంబైపీసీ) లేదా మూడేళ్ల డిప్లొమా (హోమ్ సైన్స్) కోర్సులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 31.12.2024 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. అభ్యర్థులకు ఇంటర్ లో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు కచ్చితంగా దరఖాస్తును ఆఫ్ లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, లాం, గుంటూరు–522034, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి. దరఖాస్తులు 29.07.2024. తేదీ లోపల చిరునామకు చేరాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక వైబ్ సైట్ https://angrau.ac.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.