భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారి మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం సృష్టించింది. జాతీయ రహదారి పక్కన గల మిర్జాపూర్ గేటు సమీపంలోని మార్గంలో వెళుతున్న స్థానికులు ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతడి మృతికి గల కారణాలను సేకరిస్తున్నామని చెన్‌గోముల్ ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
నేషనల్ హైవేపై డెడ్‌బాడీ కలకలం
RELATED ARTICLES