భారత్ సమాచార్, విద్య ;
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుండి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (RIMC) డెహ్రాడూన్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్-2025 ను తాజాగా విడుదల చేశారు.
ఈ ప్రవేశ పరీక్ష రాయటం ద్వార మిలిటరీ కాలేజ్ 8వ తరగతిలో బాలబాలికలు సీట్లు సాధిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను 2024 డిసెంబర్ 1 వ తేదీన నిర్వహించనున్నారు. పరీక్ష రాయలనుకునే ఆసక్తి గల విద్యార్థులు కచ్చితంగా ప్రస్తుతం 7వ తరగతి చదువుతూ అన్న ఉండాలి లేదా 7వ తరగతి పూర్తి అయిన చేసి ఉండవచ్చు. దరఖాస్తుదారుల వయస్సు 2025 జూలై 1వ తేదీ నాటికి కచ్చితంగా 11½ నుండి 13 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. ( అంటే 02 జూలై 2012 మరియు 01 జనవరి 2014 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు). ప్రవేశ పరీక్ష లిఖిత పద్ధతిలో ఉంటుంది. గణితం (09:30 – 11:00 గంటల వరకు), జనరల్ నాలెడ్జ్ (12:00 – 13:00 గంటల వరకు), మరియు ఇంగ్లీష్ (14:30 – 16:30 గంటల వరకు) ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు,
వైవా-వోసేలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎంపిక చేసిన సైనిక ఆసుపత్రులలో వైద్య పరీక్ష (undergo) చేయవలసి ఉంటుంది. పరీక్ష కేంద్రం సాధారణంగా విజయవాడలో ఉంటుంది.
ఆన్ లైన్ లేక ఆఫ్ లైన్డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కూడా దరఖాస్తులు చేయవచ్చు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష ఫీజును రూ.600 గా నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.555 చెల్లించాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్: RIMC లేదా APPSC, విజయవాడలోని అసిస్టెంట్ సెక్రటరీ (ఎగ్జామ్స్) కి పంపవచ్చు. అవసరమైన పత్రాలు*: దరఖాస్తులలో పుట్టినతేదీ ధృవీకరణ పత్రం, డోమిసైల్ సర్టిఫికెట్, SC/ST సర్టిఫికెట్ (కావలసినట్లైతే), పాఠశాల సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ ఫోటోకాపీ మరియు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తులు 2024 సెప్టెంబర్ 30 లోపు APPSC, విజయవాడలోని అసిస్టెంట్ సెక్రటరీ (ఎగ్జామ్స్)కి పంపిచాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలకు అధికారిక వైబ్సైట్ rimc.gov in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.