భారత్ సమాచార్.నెట్, తమిళనాడు: ఇటీవల కాలంలో ప్రేమ జంటలు చేసే పిచ్చిపనులు ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రహదారులపై, హోటళ్లలో, విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మితిమీరిన స్వేచ్ఛతో లవర్స్ చేసే పనులతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ప్రమాదకర రీతిలో బైక్‌పై స్టంట్స్ చేస్తున్నారు. మరికొందరు విభిన్నంగా తమ ప్రేయసితో కలిసి సాహసోపేత చర్యలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టా రీల్స్ కోసం రకరకాల విన్యాసాలు చేసి కటకటాలపాలవుతున్నారు.
పోలీసులు, అధికారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత అవగాహన కల్పించినా, జరిమానాలు విధించినా, పక్కా నిబంధనలు అమలు చేసినా కొందరిలో మార్పు రావడంలేదు. పిచ్చి పీక్ స్టేజ్‌లోకి వెళ్లి ప్రవర్తిస్తున్నారు. ప్రేమ మోజులో పడి హద్దులు మీరి విన్యాసాలు చేస్తున్నారు. లవర్స్ రోడ్డుపైనే రోమాన్స్ చేస్తూ కటకటాలపాలవుతున్న ఉదంతాలు మనం చూస్తున్నాం. బైక్‌పై స్టంట్స్ చేసి ఓ ప్రేమ జంట పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుపూర్ జాతీయ రహదారిపై జరిగింది. ఓ ప్రేమ జంట తాజాగా బైక్ స్టంట్స్ చేస్తూ ఇన్‌స్టా రీల్స్ తీసింది. యువకుడు బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చోగా, యువతి బైక్ నడిపింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఆ ప్రేమ జంటకు రూ.13వేల ఫైన్ విధించారు.