Homebreaking updates newsలాల్‌దర్వాజా బోనాలు.. పోటెత్తిన భక్తులు

లాల్‌దర్వాజా బోనాలు.. పోటెత్తిన భక్తులు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: బోనాల పండుగతో హైదరాబాద్ పాతబస్తీలో ఉత్సాహం ఉట్టిపడుతోంది. అర్థరాత్రి నుంచి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లాల్‌దర్వాజాలో అమ్మవారికి బోనం సమర్పించేందుకు క్యూ కట్టారు. అర్థరాత్రి నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించడం ప్రారంభమైంది.

పోటెత్తిన భక్తజనం:
అమ్మవారి కోసం ప్రత్యేక ఘట్టం ఏర్పాటు చేశారు. ఇక తెల్లవారుజాము నుంచి అమ్మవారికి మొక్కుల చెల్లించేందుకు భక్తులు తరలివస్తున్నారు. మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. లాల్‌దర్వాజా ఆలయం దగ్గర ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేక లైన్లు ఉన్నాయి. నేడు అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. రేపు రంగం సహా అమ్మవారి ఘటాల ఊరేగింపు ఉంటుంది. ఇవాళ నగరంలో 23ప్రధాన ఆలయాల్లో బోనాల జాతర కొనసాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments