Homemain slidesప్రపంచ క్యాన్సర్ రాజధాని భారత్

ప్రపంచ క్యాన్సర్ రాజధాని భారత్

భారత్ సమాచార్, జాతీయం ;

కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు… భారతీయులకు క్యాన్సర్ రావటానికి కూడా చాలా కారణాలున్నాయి. మారుతున్న భారతీయుల జీవనశైలి, రేడియేషన్, జంక్ పుడ్ తరహా ఆహారపు అలవాట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను అతిగా వినియోగించటం, గ్లోబల్ వార్మింగ్, వాయు,జల కాలుష్యం, ప్లాస్టిక్ అతి వినియోగం మొదలైనవి. దేశంలో క్యాన్సర్ కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో, పరిశోధకులు ఆసక్తికర అంశం వెల్లడించారు. భారత్ లో ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు ఉందని తాజాగా వెల్లడించారు. అయితే, ఈ క్యాన్సర్ రకాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల వాటిలో చాలావరకు నివారించిదగినవేనని వివరించారు. గత కొంత కాలంగా భారత్ లో క్యాన్సర్ కేసుల సంఖ్యలో గణనీయ పెరుగుదల కనిపిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. అపోలో హాస్పిటల్స్ హెల్త్ ఆఫ్ నేషన్ పేరిట రూపొందించిన నివేదికలో ప్రపంచానికే క్యాన్సర్ రాజధానిగా భారత్ ను పేర్కొన్నారు. భారతదేశంలో 2020 లో 1.4 మిలియన్ క్యాన్సర్ కేసులు ఉంటే, వాటి సంఖ్య 2025 నాటికి 1.57 మిలియన్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఆ నివేదిక చెబుతోంది.

దేశంలో పొగాకు వినియోగాన్ని కట్టడి చేస్తే చాలావరకు క్యాన్సర్ కేసుల పెరుగుదలకు అడ్డుకట్ట వేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో దాదాపు 267 మిలియన్ల మంది పొగాకు వినియోగిస్తుంటారని, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కొన్ని ఇతర రకాల క్యాన్సర్లకు పొగాకే కారణమని వివరించారు. అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్త జీవనశైలి క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని పేర్కొన్నారు. క్యాన్సర్ మహమ్మారిపై పోరాడాలంటే ప్రజల్లో చైతన్యం కలిగించడం ఎంతో ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. క్యాన్సర్ ను గుర్తించే స్క్రీనింగ్ పరీక్షలను వీలైనంత ఎక్కువగా నిర్వహించాలన్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

భారత్ లో నిరుద్యోగానికి మరో ఉదాహరణ

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments