Homemain slidesఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు

ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు

భారత్ సమాచార్, జాతీయం ;

ఆగస్టు మొదటి వారం నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని కోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ లోకి చేరుతుంది. కాబట్టి ఈ కొత్త నిబంధనల విషయాల్లో మీరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే.

కొత్త ఫాస్టాగ్ రూల్ ఏంటి?

ఫాస్టాగ్‌కి రూల్స్‌లో వచ్చిన అతిపెద్ద ఛేంజ్ ఏంటంటే మీరు కేవైసీ ప్రాసెస్‌ను కచ్చితంగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ ఖాతాలను మార్చాలి. దీని కోసం ఫాస్టాగ్ యూజర్లు తన ఖాతా ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేయాలి. అవసరమైతే దాన్ని తప్పనిసరిగా మార్చుకోవాలి.

అదే సమయంలో మూడు సంవత్సరాల వయస్సు ఉన్న ఫాస్టాగ్ ఖాతాలు వారి కేవైసీని మళ్లీ అప్‌డేట్ చేయాలి. ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీ పూర్తి చేయడానికి తుది గడువు అక్టోబర్ 31వ తేదీ వరకు వాహనదారులకు ఉంటుంది. యూజర్లు, కంపెనీలు తమ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ అప్‌డేషన్ ప్రక్రియను అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేసే అవకాశం కల్పించారు. అయితే మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది.

మరికొన్ని వార్తా విశేషాలు…

టోల్ గేట్ సేవలను వినియోగించుకోండి

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments