Homemain slidesఏటీఎం నుంచి రేషన్ బియ్యం...

ఏటీఎం నుంచి రేషన్ బియ్యం…

భారత్ సమాచార్, జాతీయం ;

మీరు ఇప్పటి వరకు చాలా సార్లు ఏటీఎం నుంచి డబ్బుని తీసుకొని ఉంటారు. బ్యాలన్స్ ని కూడా చెక్ చేసుకొని ఉంటారు. ఇక మీదట అలా ఏటీఎం కి వెళ్లి బియ్యం కూడా తెచ్చుకునే రోజులు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం ఒడిశా రాష్ట్రంలో ప్రవేశపెట్టింది. దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ఒడిశాలో తాజాగా ప్రారంభమైంది. భువ నేశ్వర్ లోని ముంచేశ్వర్ ప్రాంతంలోని గోదాములో ఈ నూతన బియ్యం ఏటీఎంను ప్రారంభించింది. ఇందులో మొదటగా రేషన్ లబ్ధిదారులు తమ రేషన్ కార్డు నెంబర్ ను బియ్యం ఏటీఎం స్కీన్ పై నమోదు చేయాలి. ఆ నంబర్ యాక్సస్ అయిన తర్వాత అక్కడ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటీఎం నుంచి వచ్చే బియ్యాన్ని బస్తాలో నింపుకోవచ్చు. ప్రతీ రేషన్ కార్డు లబ్ధిదారుడు ఏటీఎం ద్వారా ఒకేసారి 25 కిలోల బియ్యాన్ని పొందే అవకాశాన్ని ప్రస్తుతం కల్పించారు.

ఈ విధానం ద్వారా బియ్యం కోసం రేషన్ దుకాణాల ముందు గంటల తరబడి నిలబడాల్సిన అవసరం ఉండదు. అంతేకాక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ప్రయోగాత్మకంగా భువనే శ్వర్ లో ఈ బియ్యం ఏటీఎంను ప్రారంభించారు. ఒడిశాలోని మొత్తం 30 జిల్లాల్లో ఈ రేషన్ బియ్యం ఏటీఎంలను తెరిచే యోచన లో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ విజయ వంతం అయితే.. రేషన్ కార్డు పథకం కింద ఇతర రాష్ట్రాలకు ఈ విధానం విస్తరించే అవకాశం ఉంటుంది.

మరికొన్ని వార్తా విశేషాలు...

ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు

RELATED ARTICLES

Most Popular

Recent Comments