భారత్ సమాచార్, ఆరోగ్యం ;
దానిమ్మ పండులో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అనేక పోషకాలకు నిధిగా దానిమ్మ పండ్లను వైద్యులు చెబుతుంటారు. ఫైబర్, ఫొలేట్, పొటాషియం, మెగ్నిషియం, విటమిన్ సి, కె తదితర పోషకాలు ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దానిమ్మ పండ్లను తరచూ తింటే ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతుంటాయి. అలాగే పలు అనారోగ్య సమస్యలు కూడా రాకుండా కూడా మనం చూసుకోవచ్చు.
- దానిమ్మ పండ్లను రోజూ తింటుంటే రక్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వు కరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల మన హృదయానికి రక్తం బాగా సరఫరా అవుతుంది. చిన్న వయసులోనే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
- కీళ్ల దగ్గర వాపులు తీవ్రంగా వస్తే కీళ్ల నొప్పుల సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవాలన్నా, ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా నిత్యం దానిమ్మ పండును తినాలి. లేదా ఆ పండు జ్యూస్ తాగాలి.
- దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ట్యూమర్ గుణాలు ఉన్నందున క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే ప్యూనిసిక్ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. దీంతో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు.
- హైబీపీ ఉన్నవారు నిత్యం దానిమ్మ పండు జ్యూస్‌ను తాగాలి. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల బాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
- నిత్యం వ్యాయామం చేసేవారికి దానిమ్మ పండ్ల జ్యూస్ మంచి శక్తినిస్తుంది. కోల్పోయిన శక్తిని తిరిగి ఇవ్వడంతోపాటు పోషకాలను కూడా అందిస్తుంది.