Homemain slidesపేదలకు ప్రభుత్వ గృహాలు...

పేదలకు ప్రభుత్వ గృహాలు…

భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు నూతన గృహాలు నిర్మించటానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వం అందించే పథకం ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పిఎంఎవై 2.0) కింద గృహాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం రూపొందిస్తోంది. ఈ పథకం కింద అర్బన్‌, పిఎంఎవై గ్రామీణ్‌ కింద గ్రామాల్లో ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి అర్హులను గుర్తించేందుకు ఇంటిటి సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఇళ్లు లేని పేదలు సుమారు 10 నుంచి 12 లక్షల వరకు ఉండొచ్చని ప్రభుత్వ ప్రాథమిక అంచనాగా ఉంది. అర్బన్‌, పిఎంఎవై గ్రామీణ్‌ కింద గ్రామాల్లో ఇళ్లు నిర్మించేలా కసరత్తు జరుగుతోంది. ఈ పథకాన్ని 60:40 నిష్పత్తిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక డిజైన్‌ చేసింది. గతంలో ఇళ్లు మంజూరైన వారు, ప్రభుత్వ పరంగా లబ్ధి పొందినవారు, దారిద్య్ర రేఖకు ఎగువున ఉన్న వారు గృహ నిర్మాణశాఖ నూతనంగా తేనున్న 2.0 పథకానికి అనర్హులుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం గృహాల నిర్మాణ విలువ ఖరారు పైన కసరత్తు జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన 2.0 యూనిట్‌ కింద నిర్మించనున్న గృహాల నిర్మాణ విలువను ఇప్పుడు అమల్లో ఉన్న రూ.1.80 లక్షలు కాకుండా అర్బన్‌లో యూనిట్‌ కాస్ట్‌ను రూ.4.30 లక్షలకు పెంచారు. అర్బన్‌లో నిర్మించే ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.2.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.1.80 లక్షలు చెల్లించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లను పిఎంఎవై గ్రామీణ్‌ కింద ఒక్కో యూనిట్‌ విలువ రూ.2.10 లక్ష్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.1.08 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.72 వేలుగా ఉంటుంది.

హడ్కో రుణాలు

దీంతో పాటుగా ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్‌/ఎస్‌బిఎమ్‌ కన్వర్జెన్స్‌ కింద మరో రూ.30 వేలు ఇవ్వనున్నారు. ఇంటింటి సర్వే పూర్తికాగానే ఆయా లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌ (ఎంఐజి), లోయిస్ట్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌(ఎల్‌ఐజి) వర్గాలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు లబ్ధిదారులకు భారంగా మారకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం హడ్కో ద్వారా రుణాలు ఇప్పించనుంది. వీటి పైన త్వరలోనే మార్గదర్శకాలు జారీ కానున్నాయి.

మరి కొన్ని వార్తా విశేషాలు...

వడ్డీ లేకుండా రూ.3 లక్షల రుణం

RELATED ARTICLES

Most Popular

Recent Comments