Homemain slidesబంగ్లాదేశ్ మాజీ ప్రధాని పై 53 కేసులు...

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పై 53 కేసులు…

భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

అత్యధిక కాలం బంగ్లాదేశ్‌ కు ప్రధానిగా కొనసాగిన షేక్ హసీనా పై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆమెతో పాటుగ మాజీ మంత్రులు, అనుచరులపై కూడా తాజాగా మరో నాలుగు హత్య కేసులు నమోదయ్యాయి. 2010లో బంగ్లాదేశ్‌ రైఫిల్స్‌ ఉన్నతాధికారి మరణానికి సంబంధించి కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 53కు చేరింది. బంగ్లాదేశ్‌లో రైఫిల్స్‌లో 2010లో డిప్యూటీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అబ్దుల్‌ రహీం ఉన్న సమయంలో అక్కడి ఫీల్‌ఖానాలో మారణహోమం సంభవించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రహీం.. అదే ఏడాది జులై 29న జైల్లో మరణించాడు. దీనిపై రహీం కుమారుడు అబ్దుల్‌ అజీజ్‌ తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌పై మాజీ ప్రధాని హసీనాపై అభియోగాలు మోపారు. జులై 18న చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మిలటరీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో హసీనాతోపాటు మరో 48 మందిపై హత్యకేసు నమోదైంది. ట్రేడింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన వ్యక్తితోపాటు ఆటోరిక్షా డ్రైవర్‌ మరణం కేసుల్లో హసీనాతోపాటు పలువురిపై హత్యకేసు నమోదైంది. మొత్తంగా హసీనా ప్రస్తుతం 53 కేసులు ఎదుర్కొంటున్నారు. వీటిలో 44 హత్య కేసులు, మారణహోమానికి సంబంధించి ఏడు, ఒకటి అపహరణతో పాటు బీఎన్‌పీ పార్టీ ఊరేగింపు సమయం సమయంలో చోటుచేసుకున్న ఘర్షణలో మాజీ ప్రధాని హసీనాపై దాడి కేసు నమోదయ్యింది. దీనిపై మాజీ ప్రధాని ఎలా స్పందిస్తారో అని సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.

మరి కొన్ని వార్తా విశేషాలు…

2012 లండన్ ఒలింపిక్స్ లో ‘నైతిక విలువలు’

RELATED ARTICLES

Most Popular

Recent Comments