Homemain slidesకాళ్ల అందం పై కవి భావం...

కాళ్ల అందం పై కవి భావం…

భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

అమ్మాయిల సొగసును వర్ణించటానికి కవులందరూ వారి పెదాల చిరునవ్వుతో సహా చాలా వాటి గురించి చాలా విధాలుగా కవిత్వం గుప్పించారు. కానీ కొంచెం ఆలోచిస్తే ముద్దుగుమ్మల కాళ్ల సొగసును మెచ్చుకోవం మరిచారేమో అని అనిపిస్తుంది. దీనికి సమాధానంగా శాస్తి గారు ఓ గీతాన్ని సందించారు… దానిపై ఓ లుక్ వేయండి.

చిత్రం ; అలా వైకుంఠపురంలో (2020)
దర్శకుడు ; త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీత దర్శకుడు ; తమన్
గీతా రచన ; సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం ; సిద్ద్ శ్రీరామ్

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి
చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు
దయలేదా అసలు

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి
చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు
దయ లేదా అసలు

నీ కళ్లకి కావలి కాస్తాయే
కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది
చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ
ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా, నిట్టూర్చవటే
నిష్టూరపు విలవిలలు

సామజవరగమనా
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

సామజవరగమనా
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి
చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు
దయలేదా అసలు

మల్లెల మాసమా
మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన
వన్నెల వనమా
విరిసిన పించమా
విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నెసిన్నెలంటే
ఎన్నగ వశమా

అరె’ నా గాలే తగిలినా
నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా
ఎంతో బతిమాలినా
ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన
మనవిని వినుమా

సామజవరగమనా
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

సామజవరగమనా
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి
చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు
దయలేదా అసలు

నీ కళ్లకి కావలి కాస్తాయే
కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది
చిందేనే సెగలు

మరికొన్ని సినీ సంగతులు

ఓ ప్రియుడి ప్రేమ విరహ గీతం…

RELATED ARTICLES

Most Popular

Recent Comments