భారత్ సమాచార్, రాజకీయం ;
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వారాహి డిక్లరేషన్ మీద చర్చ సాగుతోంది. అయితే దీనిపై విపక్షాలు కూడా కౌంటర్ ఎటాక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి. దక్షిణాదిలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి రాజకీయంగా పెద్దగా పట్టు లేదు. దీంతో ఇక్కడ పవణ్ కళ్యాణ్ ని ముందు పెట్టి మత రాజకీయాలు చేయటం ద్వార భవిష్యత్ లో రాజకీయంగా లబ్ది పొందాలనేది భాజాపా వ్యూహం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవర్ స్టార్ సడన్ గా సనాతన ధర్మ పరిరక్షడుగా మారటంలో కాషాయ సిద్దాంత వ్యుహకర్తలు సలహాలు ఉన్నాయని పొలిటికల్ టాక్. తాజాగా ఉపముఖ్యమంత్రి తమిళనాడుపైనా, ఉత్తరాదిపైనా ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. అందుకే పవన్ కల్యాణ్ కొత్త తరహా కాషాయ రాజకీయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది.
హఠాత్తుగా పవన్ సనాతన ధర్మం గురించి ఉద్యమం ప్రారంభించడానికి వెనుక లోతైన .. దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉంటుందని అనుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడున్నర నెలలు మాత్రమే. ఆయన ఇంకా తనదైన ముద్ర వేయలేదు. ఈ లోపే సనాతన ధర్మ రక్షణ వైపు అడుగులేశారు. తిరుపతిలో జరిగిన సభలో రాముడి విషయంలో రాహల్ గాంధీ పైనా విమర్శలు చేశారు. తమిళనాడులో బీజేపీ భావజాలం మరింత బలపడేలా .. డీఎంకే కొత్త నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్నీ ఖండించారు. దీంతో అంతా బీజేపీ కనుసన్నల్లోనేజరుగుతోందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ కాషాయ పవనాలు ఏపీ రాజకీయాల్లో బీజేపీని రాజకీయంగా ఎటు వైపుకు తీసుకెళ్తాయో వేచి చూడాలి.