Homebreaking updates newsరెచ్చగొట్టే వారి మాటలు నమ్మద్దు.. సీఎం

రెచ్చగొట్టే వారి మాటలు నమ్మద్దు.. సీఎం

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

మూసీ పరీవాహక ప్రాంత నిరుపేదలెవరూ నిరాశ్రయులు కాబోరని, వారందరికీ ప్రత్యామ్నాయం కల్పించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా స్పష్టం చేశారు. రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న వారందరికీ మంచి ప్రణాళికలు అమలు చేస్తామన్నారు. ఈ విషయంలో కొందరు రెచ్చగొటే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని అన్నారు.

🔹 స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా)95 వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వెంకటస్వామి ని స్పూర్తిగా తీసుకుని నిరుపేదలందరికీ ఒక మంచి జీవితాన్ని, మంచి వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

🔹 మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదల కోసం ఈ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా హామీనిచ్చారు.

🔹 హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నగరంలో 12 నుంచి 14 వందల ఫీట్ల లోతుల్లోకి బోరు వేస్తే తప్ప నీళ్లు పడే పరిస్థితి లేదని చెప్పారు. మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ ప్రజలు విషాన్ని దిగమింగుకుని బతుకుతున్నారని వాపోయారు.

🔹 నిరుపేదలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేతల సూచనలు కూడా తీసుకోవడానకి ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కి, హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ముఖ్యమంత్రి సూచించారు.

🔹 మహనీయుడు వెంకటస్వామి ఆకాంక్షించినట్టు తమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఆదిలాబాద్ కు నీరందిస్తాం. అభివృద్ధిలో ఆదిలాబాద్ తో పాటు పెద్దపల్లి జిల్లాకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు.

🔹 ప్రజా ప్రభుత్వం కాకాను సమున్నతంగా గౌరవిస్తూ వారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తోందని సీఎం పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి , గడ్డం వంశీకృష్ణ , అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం , ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి , గడ్డం వినోద్ , కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , కేఆర్ నాగరాజు , మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ , సీపీఐ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

హైడ్రా బాధితులకు అండగా ఉంటాం…కేటీఆర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments