Homemain slidesచరిత్రలో ఈ రోజు అక్టోబర్ 7వ తేదీ

చరిత్రలో ఈ రోజు అక్టోబర్ 7వ తేదీ

భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

ప్రముఖుల జననాలు

1885: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

1900: గంటి జోగి సోమయాజి, తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి, కళాప్రపూర్ణ.

1900: హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీ సభ్యుడు.

1901: మసూమా బేగం, సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు.

1929: కొర్లపాటి శ్రీరామమూర్తి, విమర్శకుడు, సాహితీ పరిశోధకుడు, కవి, నాటకకర్త, దర్శకుడు, ప్రయోక్త, కథకుడు, ఉత్తమ అధ్యాపకుడు.

1945: అట్లూరి సత్యనాథం, కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం) లో విశిష్టాచార్యునిగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

ప్రముఖుల మరణాలు

1940: కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు.

1975: డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత

1976: పి. చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు.

2007: పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు.

చారిత్రక సంఘటనలు

1737: 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాలును ముంచెత్తగా, దాదాపు 3 లక్షల మంది మరణించారు.

1952 : పంజాబు రాష్ట్రానికి రాజధానిగా చండీగఢ్ ఎంపిక.

మరికొన్ని వార్తా విశేషాలు

చరిత్రలో ఈరోజు అక్టోబర్ 6వ తేదీ

RELATED ARTICLES

Most Popular

Recent Comments