భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;
నేటి ప్రత్యేకత
భారత వైమానిక దళ దినోత్సవం.
రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ దినోత్సవం.
ప్రముఖుల జననాలు
1860: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు.
1891: భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త.
1895: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త.
1902: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ ఉపకులపతి
1918: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు.
1918: బత్తులసుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు.
1935: ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, వైద్యుడు.
1950: చివుకుల ఉపేంద్ర, అమెరికా లోని ఫ్రాంక్లిన్‌టౌన్‌షిప్‌కు డెప్యూటీ మేయర్‌గా, 2000లో మేయర్‌గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతి.
1977: మంచు లక్ష్మి, భారతీయ సినీ, టెలివిజన్ నటి, నిర్మాత,
1981: దాసరి మారుతి, తెలుగు సినీ దర్శకుడు.
1981 : భారతీయ సినిమా నటి వేద శాస్త్రి జననం.
ప్రముఖుల మరణాలు
1936: ప్రేమ్‌చంద్, భారతదేశపు హిందీ, ఉర్దూ కవి.
1963: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు.
1976: కందుకూరి రామభద్రరావు, తెలుగు రచయిత, కవి, అనువాదకుడు.
2008: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త సంఘ సేవకురాలు, చిత్రకారిణి.
నేటి ప్రముఖ చారిత్రక సంఘటనలు
2009 : 2009 అక్టోబరు 8న, ఒబామా మాథ్యూ, షెపర్డ్, జేమ్స్ బైర్డ్, Jr. హేట్ ప్రతీకార నేరాల నిరోధక చట్టంపై సంతకం చేశారు
1993: దక్షిణాఫ్రికాలో జాతివివక్ష అంతమవడంతో దానిపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్యసమితి ఎత్తివేసింది.