భారత్ సమాచర్, జాతీయం: సనాతన ధర్మంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఓ వ్యక్తి జీవిత చక్రం తాను పుట్టిన ఘడియల ఆధారంగా ప్రారంభమవుతుంది. పుట్టిన సమయం ఉంటే వారి జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా చెప్పగల సామర్థ్యం జ్యోతిష్య శాస్త్రానికి ఉందంటున్నారు జ్యోతిష్కులు. పుట్టిన సమయం ఆధారంగా నక్షత్ర రాశులను పరిగణిస్తారు. వాటి ప్రకారం జరగబోయే అంశాలను గురించి తెలియజేస్తారు. ఆధ్యాత్మికత అనేది జ్యోతిష్య శాస్త్రం తో ముడిపడి ఉంటుందనేది ఆధ్యాత్మికవేత్తలు చెపుతారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులు ఉంటాయి 12 రాశులలో ఒక్కో రాశికి 3, 4 నక్షత్రాలు ఉంటాయి. వాటి ప్రకారం మానవుని జీవన మనుగడను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఏ రాశి వ్యక్తులకు ఎటువంటి మనస్తత్వం ఉంటుంది, ఏ విధంగా ప్రవర్తిస్తారు, వారి జీవన విధానం ఏమిటి, వారి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది కూడా జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా కనిపెట్టవచ్చు అని జ్యోతిష్య పండితులు అంటున్నారు.
పుట్టిన జన్మ నక్షత్రం ఆధారంగానే 12 రాశులలో కేవలం కొందరికి మాత్రమే ఈ అతీంద్రీయ శక్తి సామర్థ్యాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు తమకు దయ్యాలు, ఆత్మలు కనిపించాయని, అవి సమీపంలోనే ఉన్నాయని చెబుతుంటారు. మరికొందరైతే వారు ఆత్మలతో మాట్లాడతాం అని చెబుతారు. అయితే వారికి నిజంగానే ఆత్మలు, దయ్యాలు కనిపిస్తాయా అన్న అనుమానాలు ఎదుటి వారిలో వస్తుంటాయి. వారేదో భ్రమలో ఉన్నారని అనుకుంటారు. వాళ్ళు చెప్పే మాటలను నమ్మలేక పోతారు. అయితే కొన్ని రాశుల వారికి ఆ శక్తి ఉంటుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. ఓ మనిషి పుట్టిన తిథి, రాశి, నక్షత్రాన్ని బట్టి వారికి అది సాధ్యం అని చెబుతున్నారు. కొన్ని రాశులలో, తిథులలో పుట్టిన వారికి అతీంద్రియ శక్తులు ఉంటాయని చెబుతున్నారు పండితులు. అలాంటివారిని అవహేళన చేయడం లాంటివి చేయరాదు. ఎందుకంటే వాళ్లకు ఉండే అతీంద్రియ శక్తి అటువంటిది. వాళ్లకి ఆత్మలు ఉన్నాయని, సమీపంలోని తిరుగుతున్నాయని తెలిసినప్పటికీ.. నిరూపించలేని పరిస్థితిలో ఉంటారు. 12 రాశులలో మూడు రాశుల వ్యక్తులు అద్భుతమైన అతీంద్రియ శక్తుల కలిగి ఉంటారట. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
మిథున రాశి…
అతీంద్రీయ శక్తులు కలిగిన రాశులలో మొదటిది మిథున రాశి. మిథున రాశిని బుధ గ్రహం పాలిస్తుంది. ఈ గ్రహాన్ని సమాచార గ్రహం అంటారు. ఈ రాశి వారు గ్రహాంతర శక్తులు, దయ్యాల గురించి తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తారట. వీరికి నిద్రలో కనిపించే కలలు స్పష్టంగా ఉంటాయట. అంతే కాదు ఎవరైనా ఏదైనా విషయం గురించి భయపడితే అలాంటి విషయాలను గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారంటున్నారు పండితులు. వీరిలో ఈ ఆలోచన ఎక్కువగా ఉండటం వల్ల వారికి ఆత్మలను చూసే సామర్థ్యం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
వృశ్చిక రాశి..
అతీంద్రీయ శక్తులు కలిగిన మరో రాశి వృశ్చిక రాశి వారు. ఎక్కువగా పునర్జన్మ, ఆత్మ, మరణం వంటి విషయాలను తెలుసుకునేందుకు ఎక్కువగా వీరు ఆసక్తి చూపుతారు. ఈ రాశిలో పుట్టిన వారికి అంతర దృష్టి ఉంటుందట. అదేవిధంగా జల శక్తి ఉంటుందంటున్నారు పండితులు. ఈ రాశిగల వారు దయ్యాలను కూడా చూడగలుగుతారట. ఎక్కడ ఆత్మలు ఉన్నాయో తెలుసుకునే శక్తి వీళ్లకు ఉంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు.
మీన రాశి…
అతీంద్రీయ శక్తులను కలిగిన చివరి రాశి మీనరాశి. మీన రాశి వారికి అద్భుతమైన అంతర దృష్టి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాశి వారిని వరుణ గ్రహం అని అంటారని పండితులు చెబుతున్నారు. వీటికి సమీపంలో ఆత్మలు ఉన్నట్లయితే ఇట్టే తెలిసిపోతుందట. మానసిక శిథిలాలు, ఆత్మల శక్తులు లాంటి వాటి పై వీరికి అవగాహన ఉంటుంది. అంతే కాదు ఈ రాశి వారు అవలీలగా దయ్యాలను, ఆత్మలను చూడగలరని, వాటితో మాట్లాడగలరని చెబుతున్నారు. అయితే తమకు ఆత్మల గురించి తెలిసినప్పుడు ఎదుటి వారికి చెప్తే ఒకవేళ నమ్ముతారో, లేదో అని సందిగ్ధంలో ఈ విషయాలను వారు ఎవరితో పంచుకోరని నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఆత్మలు సమీపంలో ఉన్నప్పటికీ అవి తనను ఏమీ చేయలేవు అనే ధైర్యాన్ని కలిగి ఉంటారట ఈ రాశి వారు.
అయితే ఈ మూడు రాశుల వ్యక్తులు ఉన్నట్టుండి ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తూ ఉంటారని, చుట్టూ ఉన్నవారికి వారి ప్రవర్తన అర్థం కాదని పండితులు అంటున్నారు. అయితే ఆ సమయంలో వారికి దయ్యాలు, ఆత్మలు కనిపిస్తేనే అలా చేస్తారట. దీనికి కారణం వారిలో ఉండే అతీంద్రియ శక్తులేనట. అంతే కాదు వారు ఎవరూ కనిపెట్టలేని విషయాలను సైతం కనిపెడతారని, ఇది వారికి అతి సున్నితమైన విషయమని వారిని ఎట్టి పరిస్థితిలో ఒత్తిడికి గురి చేయవద్దని పండితులు చెబుతున్నారు. అయితే ఇది మానసికంగా ఇబ్బంది పడాల్సిన విషయమేమీ కాదని రాశుల ప్రభావంతో జరిగే పరిణామం అని చెబుతున్నారు. ఈ రాశుల వ్యక్తులు ఇతరులలా సాధారణమైన వారు కాదనేది గుర్తుంచుకోవాల్సిన విషయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.