Homemain slidesతెలంగాణ నుంచి దిల్లీకి మూటలు... కేటీఆర్

తెలంగాణ నుంచి దిల్లీకి మూటలు… కేటీఆర్

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీకి మూటలు పంపించటంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల అవసరాలు తీర్చటంలో లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేరు, ముఖ్యమంత్రికి విద్యారంగంలో ఉన్న సమస్యలను తెలుసుకునే ఓపిక లేదన్నారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. గురుకుల భవనాలకు అద్దె చెల్లించటం లేదన్నారు. మూసీ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసే కాంగ్రెస్ సర్కార్ దగ్గర అద్దె, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇవ్వటానికి పైసలు లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్ ఇవ్వటం లేదన్నారు. కనీసం విద్యార్థులకు అన్నం పెట్టలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా చదువు పక్కనపెట్టి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు రోడ్లపై ధర్నాలు చేసే దుస్థితి వచ్చిందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ ప్రైవేట్ కాలేజీలను నిరవధికంగా మూసివేయటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా పేద విద్యార్థులను ప్రభుత్వం చదువుకు దూరం చేస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాల్సిందిపోయి. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపించే పనిలోనే ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి సర్కార్ చెలగాటమాడుతోందని వాపోయారు. కాలేజీలు నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించినా, సర్కారుకు చీమ కుట్టినట్లైనా లేదన్నారు. వెంటనే రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో సహించదని హెచ్చరించారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

స్కిల్స్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

Recent Comments