Homemain slides‘మహా’ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత

‘మహా’ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత

భారత్ సమాచార్, భోకర్ ;

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మహారాష్ట్రలోని భోకర్ పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్ విజయాన్ని కాంక్షిస్తూ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేపట్టారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర రైతులు, రైతు కూలీలకు చెందిన నేల ఇదేనన్నారు. ఈ ప్రాంతంలో జొన్న, మినుము, పత్తి విరివిగా పండుతాయన్నారు. మహారాష్ర్టలో అడుగు పెట్టగానే హర హర మహాదేవ మంత్ర ఉచ్ఛరణతో మనసు పులకిస్తోందన్నారు. హిందూ ధర్మానికి పునాదులు వేసిన నేల ఇదన్నారు. గడచిన పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల మంది భారతీయలను పేదరికం నుంచి విముక్తి చేసిందన్నారు. 4 కోట్ల రైతులకు పంట బీమా అందించిందన్నారు. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ది చేకూరిందని తెలిపారు. ముద్ర యోజన ద్వారా 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూత ఇచ్చిన ప్రభుత్వం బీజేపీ అని తెలిపారు. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ 11 వేల కిలోమీటర్ల రహదారులు నిర్మించారన్నారు. 2028 లోపు మహారాష్ట్రను లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ఇలాంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.

భారత దేశాన్ని ఐదు లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలకపాత్ర పోషిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. మహా వికాస్ అఘాడి ప్రజలను విభజించి, పాలించాలని చూస్తోందన్నారు. దాని మాయలో పడి బందీలుగా మారొద్దని ప్రజలకు పిలుపు నిచ్చారు. మహారాష్ట్ర అభివృద్ధిపథంలో పయనించాలంటే సుస్థిర ప్రభుత్వాన్ని ప్రజలు ముందుకొచ్చి ఎంచుకోవాలని సూచించారు. అది కేవలం ఎన్డీఏ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఓటర్లకు తెలిపారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలిగే సత్తా ఒక్క మోదీ లోనే ఉందన్నారు. ఎక్కడ స్థిరతం ఉంటుందో అక్కడ సమర్థ పాలన ఉంటుందన్నారు.

మరికొన్ని వార్తా విశేషాలు...

బాధితురాలిగా వారి అరెస్టును స్వాగతిస్తున్నా… షర్మిల

RELATED ARTICLES

Most Popular

Recent Comments