Homemain slidesMedak Church: మెదక్ చర్చి వందేళ్ల మహోత్సవానికి ప్రముఖుల రాక

Medak Church: మెదక్ చర్చి వందేళ్ల మహోత్సవానికి ప్రముఖుల రాక

భారత్ సమాచార్.నెట్, మెదక్: మెదక్ చర్చి నిర్మించి వందేళ్లు పూర్తికావడంతో మెతుకుసీమకు వచ్చేందుకు ప్రముఖులు క్యూకడుతున్నారు.ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిని నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించనున్నారు. చర్చి చరిత్ర తెలుసుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం కొల్చారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు.

ప్రముఖుల రాక.. పకడ్బందీ ఏర్పాట్లు:
అదేవిధంగా ఈ నెల 25వ తేదీన క్రిస్మమస్ పర్వదినం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మెదక్ చర్చిని సందర్శించి వందేళ్ల ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అదేరోజు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కౌడిపల్లి మండల పరిధిలోని తునిఖిలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకుంటారు. ప్రముఖుల పర్యాటన తేదీలు ఖరారు కావడంతో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో సీఎస్ శాంతికుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు సమన్వయంతో ఉపరాష్ట్రపతి పర్యటనను విజయంతం అయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎస్ అదేశించారు. ఈ నెల 25న మధ్యాహ్నం 2:15గంటల నుంచి సాయంత్రం 4:15గంటల వరకు జిల్లాలో ఉపరాష్ట్రప్రతి పర్యటించనున్నట్లు సీఎస్ పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు:

‘ఇందిరాగాంధీ మెదక్ ఎంపీగా ఉన్నప్పుడే అలా జరిగింది’

 

 

 

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments