భారత్ సమాచార్.నెట్,హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, నటి రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఛావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ నెల 7న తెలుగు రాష్ట్రాలో ఛావా సందడి మొదలు కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తెలుగులో ఛావా చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో వసూళ్లు ఎలా ఉంటాయా అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. డీసెంట్ బుకింగ్ నమోదు అవుతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. హిందీలో విడుదలైన మూడు వారాల తర్వాత తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇకపోతే ఛావా మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అన్ని భాషల్లో ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా, ఛావా చిత్రంలో సంభాజీ మహరాజ్ పాత్రను విక్కీ కౌశల్ పోషించగా.. విక్కీ కౌశల్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్కీ కౌశల్ అద్భుతంగా పర్ఫార్మ్ చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అంతేకాదు విక్కీ కౌశల్ కెరీర్‌లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా కూడా ఛావా రికార్డుకెక్కింది. ఇక ఈ మూవీలో మహారాణి యేసుబాయి పాత్రను పోషించిన రష్మిక ఆట్టుకున్నారు. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా అశుతోశ్ రాణా, వినీత్ కుమార్ సింగ్, సంతోష్ జువేకర్, దివ్య కీ రోల్స్ చేశారు.