Homebreaking updates newsహిందీ వివాదం వేళ.. డీఎంకే మంత్రి దురై మురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

హిందీ వివాదం వేళ.. డీఎంకే మంత్రి దురై మురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్ సమాచార్.నెట్, నేషనల్: కేంద్ర ప్రభుత్వం- తమిళనాడు సర్కార్ మధ్య గత కొద్ది రోజులుగా జాతీయ విద్యా విధానం (NEP), డీ లిమిటేషన్ (Delimitation) విషయాల్లో తీవ్ర ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అధికార డీఎంకే (DMK) వర్సెస్ ఎన్డీఏ (NDA) కూటమి నేతల మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. హిందీని మూడో భాషాగా తప్పకుండా నేర్చుకోవాలని కేంద్రం చెబుతుండగా.. దానికి తమిళనాడులోని ఎంకే స్టాలిన్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది.
తమపై బలవంతంగా హిందీని రుద్దవద్దని, ఎన్ఈపీని తమిళనాడులో అమలు చేయబోమని తేల్చి చెప్పారు. ఇక అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన దేశంలోని లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని భావిస్తోంది. అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని డీఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఎన్ఈపీ, డీ లిమిటేషన్ అంశాల్లో వివాదాలు సరిపోవు అన్నట్లు.. కొత్తగా ఉత్తర, దక్షిణ భారతదేశాలు అంటూ డీఎంకే నేతలు కొత్త వివాదాలకు తెరతీస్తున్నారు.
తాజాగా తమిళనాడు సీనియర్ నేత మంత్రి దురై మురుగన్ (Minister Duraimurugan)వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారత్‌ దేశంలోని మహిళలు అనేక మంది భర్తల్ని కలిగి ఉండే సంస్కృతిని కలిగి ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తమిళ ఆచారాల మాదిరిగా కాకుండా ఉత్తర భారత సంప్రదాయాలు బహుభార్యత్వం, బహు భార్యత్వాన్ని కలిగి ఉంటాయని పేర్కొన్నారు. పరోక్షంగా మహాభారతాన్ని ప్రస్తావించిన దురై మురుగన్.. ఉత్తర భారత సంస్కృతిలో ఒక స్త్రీ 5 లేదా 10 మంది పురుషులను వివాహం చేసుకునేందుకు అనుమతిస్తుందని పేర్కొన్నారు. కానీ మన సంస్కృతిలో ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడన్నారు. అలాగే ఉత్తర భారత దేశంలో ఒక స్త్రీని ఐదుగురు పురుషులు కూడా వివాహం చేసుకోవచ్చు అని తెలిపారు. ఇది వారి సంస్కృతి.. ఒకరు వెళ్తే మరొకరు వస్తారన్నారు.
అదేవిధంగా తమిళాన్ని అవమానించే వారి నాలుకలను నరికేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో జనాభాను నియంత్రించాలని సూచించిందని.. వాటిని అమలు చేసిన దక్షిన భారత దేశంలో జనాభా తగ్గిందని.. కానీ ఉత్తర భారత్ దేశంలో మాత్రం జనాభా తగ్గలేదన్నారు. అయితే దురై మురుగన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. సీఎం స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. మంత్రి దురై మురుగన్ చేసిన వ్యాఖ్యలు ఉత్తర భారత్ దేశం పట్ల డీఎంకేకు ఉన్న ద్వేషాన్ని నిరూపిస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments