భారత్ సమాచార్.నెట్, ఏపీ: కేంద్ర ప్రభుత్వం (Central Govt).. తమిళనాడు (Tamil Nadu) మధ్య హిందీ భాషా (Language Controversy)వివాదం రోజు రోజుకు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందంటూ తమిళనాడు ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే త్రిభాషా సూత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). భారత్ దేశానికి బహుభాషా విధానమే మంచిదని.. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని జనసేన ఆవిర్భావ సభలో పవన్ వ్యాఖ్యానించారు. త్రిభాషా సూత్రంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భాష వద్దు కానీ డబ్బులు కావాలీ..
మాట్లాడితే సంస్కృతం, దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారని అంటున్నారని.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీని వద్దంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు. తమిళ సినిమాలను హిందీలో డబ్ చేసి డబ్బులు సంపాదిస్తారు కానీ హిందీ మాత్రం వద్దు అంటూన్నారు ఇదెక్కడి న్యాయమన్నారు. అలా అయితే తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండి అని సూచించారు. అంతేకాదు పనుల కోసం బీహార్, యూపీ నుంచి కూలీలు మాత్రం కావాలి కానీ హిందీ వద్దు.. హిందీని ద్వేషించడం ఎంతా వరకు సరైనది అని ప్రశ్నించారు. ఈ విధానం మారాలని పవన్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆలయాల్లో సంస్కృతంలో మంత్రాలు చదవకూడదు అని అంటన్నారని.. మరి ముస్లింలు అరబిక్ లేదా ఉర్దూలో ప్రార్థిస్తే ఎప్పుడైనా వద్దు అని చెప్పారా అని ప్రశ్నించారు. హిందూ ధర్మంలో సంస్కృతంలోనే మంత్రాలు ఉంటాయన్నారు. అలాంటప్పుడు తమిళంలో మంత్రాలు చదవాలా, తెలుగులో మంత్రాలు చదవాలా అని పవన్ ప్రశ్నించారు. కాగా, త్రిభాషా విధానంపై పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మరింత చర్చను పెంచాయి. అయితే ఈ వ్యాఖ్యలపై స్టాలిన్ స్పందిస్తారా లేదా అనేది చూడాలి మరి.
హిందూ మతాన్ని కించపరిస్తే సహించం..
అదేవిధంగా స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. దేశంలో అన్ని మతాలను ఒకే విధంగా చూడాలన్నారు. కొందరు ఓట్ల కోసం హిందూ మతాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు. చిన్నప్పటి నుంచి తాను శ్రీరాముడిని పూజిస్తూ పెరిగానని.. అలాంటి రాష్ట్రంలో రాముడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తే స్పందించకుండా ఎలా ఉండగలనని ప్రశ్నించారు. రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తను, అల్లాను ఎవరైనా ఏదైనా అనగలరా? అని బతికి బట్ట కట్టగలరా? అని పవన్ ప్రశ్నించారు. హిందూ దేవుళ్లను దర్శించినట్లుగా యేసును, మేరీ మాతను దూషించగలరా? అని నిలదీశారు. పార్వతీదేవి అమ్మవారిపై కొందరు పిచ్చి కూతలు కూస్తే మనం ఎందుకు భరించాలన్నారు.