Homebreaking updates newsతెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు.. యునెస్కో జాబితాలో నారాయణపేట నిలువురాళ్లు

తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు.. యునెస్కో జాబితాలో నారాయణపేట నిలువురాళ్లు

భారత్ సమాచార్.నెట్, తెలంగాణ: తెలంగాణ (Telangana)కు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తెలంగాణలోని నారాయణపేటలోని ముడుమల్ గ్రామంలో 3,000 సంవత్సరాల పురాతన ముడమాల్‌ నిలువురాళ్లను యునెస్కో (UNESCO) భారత దేశం నుండి తాత్కాలిక జాబితాలో చేర్చింది. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలంటే ముందుగా వరల్డ్‌ హెరిటేజ్‌ సెంటర్‌ తాత్కాలిక జాబితాలో చేర్చాలి. ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ ట్యాగ్ కోసం ఒక స్థలాన్ని పరిగణించే ముందు ఈ జాబితాలో చేర్చడం తప్పనిసరి. కాగా తెలంగాణాలో ఇప్పటి వరకు యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ ప్రదేశం ఒకటే ఉంది. అది రామప్ప ఆలయం.

 

శిలాయగంలోనే వాతావరణ మార్పులు, రుతువులు, కాలాలను గుర్తించడానికి ఆది మానవులు వీటిని ఏర్పాటు చేసుకున్నట్టు చారిత్రక పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ నిలువురాళ్లు శిలా యుగానికి సంబంధించిన ఆనవాళ్లని చారిత్రక పరిశోధకులు తెలిపారు. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో 100 వరకు గండ శిలలు ఉండగా, ఒక్కోటి 12 నుంచి 14 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. చిన్న చిన్న రాళ్లు మరో 2 వేల వరకు ఉంటాయి. ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులు, సమయాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ఒక రాయిపై సప్తర్షి మండలాన్ని ఏర్పాటు చేశారు.

 

ఇకపోతే ఈ ఏడాది భారత్‌ చేర్చిన జాబితాలో చత్తీస్‌గఢ్‌లోని కంగేర్‌ వ్యాలీ నేషనల్‌ పార్క్, తెలంగాణలోని ముడుమాల్‌ మెగాలిథిక్ మెన్హిర్, పలు రాష్ట్రాల్లో నిర్మించిన అశోకుడి శాసన ప్రదేశాలు, చౌసత్‌ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతంలోని గుప్త దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లలోని బుందేలాస్ రాజభవనాలు, కోటలు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటితో భారత్‌ నుంచి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ప్రాంతాల సంఖ్య మొత్తం 62కు చేరింది.

RELATED ARTICLES

Most Popular