భారత్ సమాచార్.నెట్, అన్నమయ్య: రెండేళ్ల క్రితం తల్లి చనిపోయింది.. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కూతురు బీఈడీ పూర్తి చేసింది. ఒక్కతే కూతురు.. తనలాగే మంచి పేరు సంపాదించుకుంటుంది అనుకున్నాడు ఆ తండ్రి. కానీ ఆమె అడ్డదారులు తొక్కింది. ఇద్దరితో ప్రేమాయణం నడిపింది. ఈ విషయం తెలిసి తండ్రి మందలించాడు. వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చెద్దామనుకున్నాడు. ఈ క్రమంలోనే అది నచ్చని ఆమె మాస్టర్ స్కెచ్ వేసింది. ఓ ప్రియుడితో కలిసి కన్నతండ్రినే చంపింది. ఈ దారుణ ఘటన ఏపీలోని మదనపల్లిలో చోటుచేసుకుంది. మదనపల్లిలో టీచర్ మర్డర్ మిస్టరీ వీడింది. కూతురే తండ్రిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కన్న తండ్రిని చంపిన కసాయి కూతురు:
మదనపల్లి ఎగువ కురువ వంకలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో టీచర్ దొరస్వామి(62) ఫ్యామిలీ నివాసం ఉంటోంది. రెండేళ్ల క్రితం దొరస్వామి భార్య లత అనారోగ్యంతో మృతి చెందడంతో ఇంట్లో తండ్రి, కూతురు మాత్రమే ఉంటున్నారు. హర్షిత(25) ఇద్దరు అబ్బాయిలతో ప్రేమాయణం నడుపుతోంది. ఈ విషయం తెలిసిన దొరస్వామి హర్షితకు కుప్పంలో పెళ్లిసంబంధం చూశాడు. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హర్షిత ప్రియుడితో కలిసి ఇంట్లోనే హత్య చేయించింది. జూన్ 13న దొరస్వామి తలపై బలంగా కొట్టడంతో ఆయన మృతిచెందాడు. హత్య జరిగిన సమయంలో కుమార్తె ఇంట్లోనే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు హర్షితను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బీఈడీ చదివిన హర్షిత తండ్రినే చంపి ఇప్పుడు కటకటాలపాలవ్వడం మదనపల్లిలో సంచలనంగా మారింది.
మరిన్ని కథనాలు: