భారత్ సమాచార్, అమరావతి ;
‘‘ఐదేళ్ల వైసీపీ పాలనలో అందరూ నరకం చూశారు. వైసీపీ పాలనలో చంద్రబాబు, పవన్ అనేక బాధలు పడ్డారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టినా టీడీపీ, జనసేన కార్యకర్తలు సంయమనం పాటించాలి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సామాన్య ప్రజలను ఏ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టొద్దు. అన్ని పార్టీల కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు కొన్ని అరాచక శక్తుల ప్రయత్నం చేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు వైసీపీ ట్రాప్‍లో పడొద్దు’’ అంటూ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. దీనికి వైసీపీ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి హోంమంత్రికి బదులు ఇచ్చింది…
వైసీపీ పాలనలో ప్రజలు నరకం చూశారని అంటున్న హోంమంత్రి ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం.. సమాధానం చెప్పగలరా? అంటూ వైసీపీ ట్వీట్టర్ ద్వారా ప్రశ్నించింది…
– కూటమి అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లో 30కి పైగా హత్యలు.. మీ వేధింపులకు తాళలేక 35 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకోవడం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా? అంటూ రాసుకొచ్చింది.
– రాష్ట్రంలో ఏదో ఒక మూల రోజూ చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరగడం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా?
– “దొరికిన వాడిని దొరికొనట్లు నడిరోడ్డుపై కొట్టండి.. హాకీ స్టిక్కులతోనైనా ?, సైకిల్ చైన్ లతోనైనా?, క్రికెట్ బ్యాట్ లతోనైనా ? మీరే చెప్పండి నా కొడకల్లారా“ అంటూ ఒక నాయకుడు.. “ఎవడినీ వదిలిపెట్టను మీ అంతు చూస్తా నేను మూర్ఖుడిని.. అధికారంలోకి రాగానే మేమేంటో చూపిస్తాం“ అంటూ మరొక నాయకుడు బహిరంగ సభల్లో చెప్పడం గతంలో ఎప్పుడైనా చూశారా?
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఇంత విఫలమవడం ఎప్పుడైనా చూశారా?
– మా మాన ప్రాణాలకు రక్షణ కల్పించమని ప్రజలు అడుగుతుంటే మీరేమో గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనేక బాధలు పడ్డారంటూ చెప్పడం ఏంటి?
– మీ పార్టీ నేతలు, టీడీపీ గూండాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే కదా ఇంతమందిని హత్య చేసింది.. పసిపిల్లలపై అత్యాచారాలు చేస్తోంది?
– మీ ప్రభుత్వం శాంతి భద్రతల అమలులో ఎందుకు విఫలమైందో చెప్పకుండా ఏవేవో కాకమ్మ కథలు చెబితే ఎలా మేడమ్.
– ఇప్పటికైనా కథలు మానేసి ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించండి.
ఫైనల్ గా ఒక్కసారి కళ్ళు ఆర్పకుండా ఈ వీడియో చూసి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత బాగా పని చేస్తున్నాయో చెప్పండి. అంటూ వైసీపీ పార్టీ ట్విట్టర్ ఖాతాలో రాష్ట్ర హోంశాఖ మంత్రిని ట్యాగ్ చేసి ప్రశ్నించింది.