Homebreaking updates newsడ్రాగన్ దేశంలో తీవ్ర జనాభా సంక్షోభం

డ్రాగన్ దేశంలో తీవ్ర జనాభా సంక్షోభం

భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

గత కొద్ది సంవత్సరాలుగా డ్రాగన్ దేశం చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పెద్ద ఎత్తున పడుతోంది. జననాల రేటు ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గడంతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలు మూసివేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది. 2023లో దేశవ్యాప్తంగా 14,808 కిండర్‌ గార్టెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ వెల్లడించింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11% తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది. అటు ప్రాథమిక పాఠశాలల సంఖ్యలోనూ భారీ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2023 ఏడాదిలో 5,645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. చైనా జనాభా వరుసగా రెండో ఏడాది పడిపోయి ఇటీవల 140 కోట్లకు చేరుకుంది. గతేడాది జననాల సంఖ్య దాదాపు 20 లక్షలు తగ్గినట్లు అంచనా. 2023లో దేశవ్యాప్తంగా 90లక్షల జననాలు నమోదయ్యాయి.. 1949 నుంచి ఇంత తక్కువగా నమోదవ్వడం అదే తొలిసారి.

మరోవైపు జనాభా పరంగా డ్రాగన్ దేశం రెండు సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఓవైపు జననాల సంతానోత్పత్తి రేట్లు తగ్గిపోగా.. మరోవైపు వృద్ధ జనాభా కూడా భారీగా పెరిగిపోతుంది. 2023 నాటికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 30 కోట్లకు చేరుకోగా.. 2035 నాటికి ఈ సంఖ్య 40కోట్లు, 2050 నాటికి 50 కోట్లకు చేరుకుంటుందని ఇటీవల ఓ నివేదిక అంచనా వేసింది. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్‌గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.

మరికొన్ని వార్తా విశేషాలు...

అన్నపూర్ణ దేశంలో ఆకలి కేకలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments