భారత్ సమాచార్, ప్రత్యేకం ;
‘అపరిచితుడు’ సినిమా వెండితెరపై ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమా కథకు మూలం ‘పర్సనాలిటీ డిజార్డర్’ అనే మానసిక వ్యాధి. సినిమాలో చూపించినట్లుగానే మన చూట్టూ ఉండే సమాజంలో కూడా చాలా మంది అపరిచితులు ఉన్నారు. ఒక వ్యక్తి సమాజంలోని ఇతరులతో ప్రవర్తించే విధానాన్ని, అతను మాట్లాడే పద్ధతిని ఆ వ్యక్తి వ్యక్తిత్వం అంటారు . మనం గమనిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనికి కారణం ఆ వ్యక్తుల వ్యక్తిత్వాల మధ్య ఉండే వ్యత్యాసం అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వల్ల అతనికి కాని, సమాజంలోని ఇతర వ్యక్తులకు కానీ ఇబ్బంది కలిగితే దాన్ని వ్యక్తిత్వ లోపాలు (పర్సనాలిటీ డిజార్డర్ ) అని అంటారు. డిజార్డర్స్ లో ఉన్న రకాల గురించి తెలుసుకుందాం…
1. Histrionic పర్సనాలిటీ డిజార్డర్…
ఈ డిజార్డర్ కలిగినవారు తమ పంతం నెగ్గించుకోవడానికి ఎంతకైన తెగిస్తారు. ఇంట్లో వస్తువులను విసిరి వేయడము, అబద్ధాలు ఆడడానికి వెనుకాడరు. వీరికి కోపం కానీ, ప్రేమ కానీ ఎక్కువగా వస్తుంది. వారు అనుకున్నది సాధించడం కోసం ప్రేమతో గాని, కోపంతో గాని, అలుకతో గాని సాధించుకుంటారు.
2.Attensive seeking disorder…
ఈ వ్యక్తిత్వ లోపం కలిగినవారు ఇతరుల దృష్టి ఎప్పుడూ తమపై ఉండాలని అనుకుంటారు . ఇతరుల దృష్టి ఏదో ఒక విధంగా తమ పైన ఉండే విధంగా వీరు అల్లరి చేయటం, బ్లేడ్తో కోసుకోవటం, కాల్చుకోవడం, తరచుగా ఇతరులతో గొడవ పడడం , వేగంగా బైక్ డ్రైవింగ్ చేయడం, ప్రేమించిన వ్యక్తి తనని ప్రేమించకపోతే వారి పైన ఆసిడ్ దాడులు చేయడం, ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం వంటి రకరకాల పద్ధతుల్లో వీరు ఇతరుల దృష్టి తమపైన ఉండేలాగా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇది చేసే క్రమంలో వారు తమ ఇతరుల మంచి , చెడు, అనే విషయాలను ఆలోచించే విచక్షణను కోల్పోతారు.
3. Narcissistic personality Disorder…
ఈ డిజార్డర్ కలిగిన వారు మేము ధనవంతులము, చాలా మేధావులము, అన్నింటిలో పైచేయి మాదే అని స్వభావం కలిగి ఉంటారు. అలా అనుకోవడంలో తప్పులేదు కానీ వీరు ఎదుటివాళ్లను తమ కన్నా తక్కువగా, హీనంగా చూస్తుంటారు.
4.Anti Social personality Disorder…
ఈ వ్యక్తిత్వ లోపం కలిగిన వాళ్లు అబద్ధం చెప్పడం, దొంగతనాలు చేయడం, డ్రింకింగ్, స్మోకింగ్ ,లాంటి అలవాట్లను కలిగి ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళు చిన్న చిన్న నేరాల నుంచి పెద్ద పెద్ద నేరాల వరకు చేయటానికి ప్రయత్నిస్తుంటారు. వీరు చేస్తున్నది సరైనదే అని నమ్ముతారు. చిన్న పిల్లల్లో ఈ లోపాన్ని కాంటాక్ట్ డిజార్డర్ అంటారు . పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను అమ్మటం, బంగారాన్ని అమ్మడం, చిన్న చిన్న దొంగతనాలు చేయడం లాంటివి చేస్తారు.
5.Schizotypal personality Disorder…
ఈ వ్యక్తిత్వ లోపం కలిగినటువంటి వారికీ భ్రమలు, వాస్తవాల మధ్య తేడా తెలియదు. దేవుళ్లతో, దయ్యాలతో మాట్లాడతాము అని అంటారు. దీనిని వారు నిజం అని నమ్ముతారు. ఇది ఒక జబ్బు అనే విషయం కూడా వారు నమ్మే పరిస్థిలో ఉండరు. వీరు మంచి పని చేయొచ్చు ,లేదా చెడు పని కూడా చేయవచ్చు. సమాజంలో వీరు స్వాములుగా, యోగులు గా కూడా చలామణి అవుతూ ఉంటారు.
6. Dependent personality Disorder…
ఈ వ్యక్తిత్వ లోపం కలిగినటువంటి వారికి సొంత వ్యక్తిత్వం ఉండదు. వీరు ఎప్పుడూ ఇతరుల పైన ఆధారపడే వ్యక్తులుగా ఉంటారు. పెళ్లికి ముందు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు. పెళ్లి తర్వాత భార్య/ భర్త పైన ఆధారపడతారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లల పైన ఆధార పడుతూ ఉంటారు.
7. శాడిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్…
ఈ రకమైన వ్యక్తిత్వ లోపం కలిగినటువంటి వారు ఎదుటి వాళ్ళని బాధ పెట్టి ఆనందిస్తారు. కష్టాల్లో ఉన్న వ్యక్తులను చూసి అర్థం చేసుకోకుండా వారిని విమర్శిస్తూ ఉంటారు. ఇతరులను ఇరకాటంలో పెట్టి ఆనందిస్తూ వుంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు పెట్టి ఆనందిస్తూ వుంటారు. లేదా తమకు తాము హింస పెట్టుకోవడం చేస్తూ ఉంటారు.
8.Boarderline personality Disorder…
ఈ రకమైన డిజార్డర్ కలిగిన వారు వారి ప్రవర్తన, mood ఎప్పుడెలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కొక్కసారి చాలా ఆనందంగా ఉంటారు. ఒక్కొక్కసారి చాలా బాధగా ఉంటారు. ఒక్కొక్కసారి చాలా కోపంగా ఉంటారు. వీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రతిస్పందిస్తారు అనేది చెప్పడం చాలా కష్టం. మీరు తరచుగా అభద్రతా భావానికి లోనవుతుంటారు. తమ జీవిత భాగస్వామి తనతో జీవిత కాలం కలిసి ఉంటారో లేదో అనే ఒక అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఎక్కడ తమ ని వదిలేసి వెళ్లిపోతారు అనే భావాన్ని కూడా కలిగి ఉంటారు. వాళ్లు వాళ్లకు నచ్చిన వ్యక్తులని చాలా గొప్పగా ఉన్నతంగా పొగుడుతూ ఉంటారు. అదే వ్యక్తి తన మనసుకు నచ్చినట్లు ప్రవర్తించ కపోతే మరుక్షణంలోనే ఆ వ్యక్తిని విపరీతంగా విమర్శిస్తూ తిడుతూ ఉంటారు.
9.Impulsive personality Disorder…
ఈ వ్యక్తిత్వ లోపం కలిగినటువంటి వారు అతిగా డబ్బు ఖర్చు పెట్టడం, విపరీతమైన కోపము, విపరీతంగా తినడము ,విపరీతంగా దూషించడం, వంటి లక్షణాలు కలిగి ఉంటారు. మాటిమాటికి వారి యొక్క జీవిత లక్ష్యాలను మార్చుకుంటూ ఉంటారు. జీవితంలో స్థిరత్వం వీళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. వీళ్లు చెప్పినట్టు వినకపోయినా, చేయకపోయినా వెంటనే బాధపడతారు . నేను చెప్పినట్టు వినకపోతే చనిపోతా అని భయ పెడుతూ ఉంటారు. నావల్ల ఎవరికీ ఏ ఉపయోగము లేదు అని అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను ఏదైనా చేయగలను అని అంటారు. నావల్ల కాదు నేను ఏమి చేయలేను అని ఒకసారి అంటారు. విపరీతమైన అనుమానాలు సెల్ఫ్ ఇమేజ్ ,
సెల్ఫ్ ఐడెంటిటీ ఉండదు.
10.Paranoid personality Disorder…
ఈ రకమైన వ్యక్తిత్వ లోపం కలిగిన వాళ్లు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ప్రతిస్పందిస్తూ ఉంటారు హైపర్ రియాక్ట్ అవుతారు . నేను చాలా మంచిదాన్ని, బాగా సంపాదిస్తున్నా , అయినా వాళ్ళు ఎందుకు నన్ను తిడుతున్నారు , అని చాలా బాధ పడుతూ ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. ఎవరైనా వీళ్లను ఎప్పుడైనా ఏదైనా గొడవ పడినా ,తిట్టినా, తిరిగి వాళ్ళ పైన పగ పెంచుకుని ప్రతీకారం తీర్చుకునే స్వభావం కలిగి ఉంటారు. భార్య, భర్తల అయితే ఒకరినొకరు అనుమానించు కుంటారు వాళ్ళ యొక్క మొబైల్ చూస్తూ ఉంటారు, వాళ్ళ పైన ఒక నిఘా వేసి ఉంచుతారు.