భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర లింగం మన భారతదేశములో ఉన్న అతి పెద్ద లింగములలో ఒకటిగా పేరు గాంచింది. ఇది నిజం గానే 8.7 మీటర్ల ఎత్తు అయిదు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం . ఈ లింగానికి అసలు పేరు ‘‘అడ వల్లన్’’ అంటారట. దీని అర్ధం నాట్యానికి ప్రతీకగా నాట్యం చేసే వాడు అని అర్ధం. దీనికే ఈ పుణ్య క్షేత్రానికి దక్షిణ కైలాసం అనే కూడా పేరు ప్రసిద్ది లో ఉంది. అలాగే ఈ లింగమును కట్టినపుడు అక్కడి ప్రజలు రాజు యొక్క ప్రభువు అని అర్థం వచ్చేలా ద్రావిడ భాషలో రాజ రాజేశ్వర ముదయార్ అని పిలిచేవారని ప్రఖ్యాతి. ఒకప్పుడు ఈ మహాలింగం కేవలం రాజు గారి దర్శనానికి మాత్రమే వీలుగా ఉండేదని పెద్దలు చెప్పేవారు. ఏక శిలా నిర్మితములైన ఈ ఆలయ భాగాలు అద్బుతముగా కనువిందు చేస్తాయి. కేవలం ఈ ఆలయ నిర్మాణం కోసమే చాలా దూరము నుండి గ్రానైట్ రాయిని తెప్పించి రాజా రాజా చోళుడు 6 సంవత్సరాల కాలములో కట్టించినట్లు చరిత్ర చెబుతుంది. అతి పెద్దదైన ఈ లింగమునకు చేసే పూజలు కూడా ఘనంగా చేసే ఏర్పాట్లు చేశారు.ఈ ఆలయ శిఖరమునకు 235 పౌన్ల బరువున్న రాయి పైకి చేర్చడానికి పడ్డ కష్టాల గురించి పూర్వికులు ఇప్పటికి కథలు కథలుగా చెప్పుకుంటారు.