HomeUncategorizedబ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్ లో ప్రవేశాలు...

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్ లో ప్రవేశాలు…

భారత్ సమాచార్,హైదరాబాద్ ;

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (జేఎన్‌ఏఎఫ్‌ఏ) యూనివర్శిటీ లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తోంది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, అనుబంధ కళాశాలల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్, బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(ఎఫ్‌ఏడీఈఈ)ని నిర్వహిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించింది. విద్యార్థులకు విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సుల వివరాలు, అందులోని సీట్లు వివరాలను వెల్లడించింది.

బీఎఫ్‌ఏ(అప్లైడ్‌ ఆర్ట్‌ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌)లో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
బీఎఫ్‌ఏ(పెయింటింగ్‌)–35 సీట్లు, బీఎఫ్‌ఏ(స్కల్‌ప్చర్‌)–20 సీట్లు, బీఎఫ్‌ఏ(యానిమేషన్‌ అండ్‌ వీఎఫ్‌ఎక్స్‌)–60 సీట్లు, బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ అండ్‌ విజువల్‌ కమ్యూనికేషన్‌)–50 సీట్లు,
బీడిజైన్‌(ఇంటీరియర్‌ డిజైన్‌)–60 సీట్లు అందుబాటులో ఉన్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది. కోర్సుల వ్యవధి నాలుగేళ్ల పాటు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోటానికి కచ్చితంగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్తులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు అందించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 04.07.2024. రూ.2000 ఆలస్య రుసుముతో 10.07.2024వ తేదీ వరకు ఆప్లే చేసుకోవచ్చు.20–21.07.2024 తేదీన ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://jnafauadmissions.com ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

మరికొన్ని కథనాలు…

ఫిషరీస్‌ యూనివర్శిటీలో డిప్లొమా కోర్సుల్లు

RELATED ARTICLES

Most Popular

Recent Comments