HomeUncategorizedతెలంగాణ ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలు

తెలంగాణ ఏకలవ్య గురుకులాల్లో ప్రవేశాలు

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : తెలంగాణ రాష్ట్రంలో 5వ తరగతి చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది. వారి పిల్లల భవిషత్ ను నిర్ణయించే పరీక్షకు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ నేడు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.  రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య ఆదర్శ గురుకులాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు అధికారికంగా నోటిఫికేషన్ ను విడదుల చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23 గురుకులాల్లో 60 సీట్ల చొప్పున 1380 (690 బాలురు, 690 బాలికల) సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. (ఎస్టీ) షెడ్యూల్డ్ ట్రైబ్ లకు చెందిని గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ కేటగిరికి చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి  చదువుతున్న విద్యార్థులు మాత్రమే పరీక్ష రాయటానికి అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం కూడా ఒక సంవత్సరానికి ఒకటిన్నర లక్షకు కచ్చితంగా మించకూడదు. విద్యార్థులను ఎంపిక కోసం పోటీపరీక్ష నిర్వహించి అందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా విద్య, ఉండటానికి వసతి, భోదన జరిగే అన్ని రోజుల్లో భోజనం కూడా అందిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో ప్రభుత్వ అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్ ను  బోధిస్తారు. పరీక్ష రాయాలనుకున్న విద్యార్థుల వయస్సు కచ్చితంగా 10-13 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి.

100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ (50), అరిథ్ మెటిక్ (25), లాంగ్వేజ్ 25 మార్కలకు వెయిటేజ్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. ఆసక్తి గల అభ్యర్థులు TSEMR ఆఫిషియల్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 22వ తేదీ తుది గడువు. ఏఫ్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించి, చివరి వారంలో ప్రవేశాలు మొదలుపెడతారు.

మరికొన్ని విద్యా సంభందిత కథనాలు…

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రైల్వేలో 4,660 ఉద్యోగాలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments