HomeUncategorizedభారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు

భారత్ సమాచార్, జాతీయం ;

ప్రతి సంవత్సరం భారత కేంద్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్హలతో విడుదల చేసే అగ్నిపథ్ పథక ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదలైంది. అగ్నివీర్ వాయు(02/ 2025) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్‌(ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) ఆన్‌లైన్‌ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులు. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థులు కచ్చితంగా 03-07-2004వ తేదీ నుంచి 03-01-2008 మధ్య మాత్రమే జన్మించి ఉండాలి. పురుషు అభ్యర్థుల ఎత్తు 152.5 సెం.మీ, మహిళ అభ్యర్థుల ఎత్తు 152 సెం.మీ. ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపికను నిర్వహిస్తారు.

ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.పరీక్ష ఫీజు రూ.550 గా నిర్ణయించారు.

ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08-07-2024.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 28-07-2024.
ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం: 18-10-2024.

మరికొన్ని విశేషాలు…

భారత ప్రభుత్వ సాఫ్ట్ వేర్ కోర్సులు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments